బంగారు బంజారాలు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 బారెడు పొద్దెక్కినా ఇంకా వారికి పొద్దుపొడవలేదు కాబోలు...పొట్ట చేత 
పట్టుకొని పొరుగు ప్రాంతాలకు పయనమయ్యారు...
మైళ్ళ దూరాన్ని సైతం లెక్కచేయక కాలి నడకన
అడవి బాట బట్టి వేరు వేరుగా విడివడి వలసలుగా వాలిపోయారు...  
పొలాలలో పనులను చేసుకుంటూ, పాడి సంపదను ప్రాణంగా 
చూసుకుంటూ గూడాలుగా తండాలుగా ఏర్పడి స్థిరంగా నిలబడిపోయారు...
పుడమి తల్లి సేవకులు వారు,ప్రకృతి ప్రేమికులు వారు,
చెమట విలువ తెలిసిన శ్రామికులు వారు,
నిష్కల్మషమైన మనసు కలిగిన నీతి మనుషులు వారు....
వారికీ సంస్కృతీ సంప్రదాయాల పైన పట్టింపులు కొంచెం ఎక్కువే 
అందుకే కాలం మారుతున్నా వారి విధివిధానాలలో పెద్దగా 
మార్పులుచేర్పులు చోటుచేసుకోలేదు....                                                                                                           యావత్ ప్రపంచం ఆధునికత వైపు పరుగులు పెడుతున్నా 
వారు మాత్రం ఇంకా అంధకారంలో బందీలుగానే ఉండిపోయారు...
ఓ వైపు విజ్ఞానం రాకెట్ లాగా అంతరిక్షంలోకి దూసుకు పోతున్నా
వారి పూరి గుడిసెలలో మాత్రం చమురు బుడ్డీలు వెలుగుతూనే వున్నాయి...
నూతన ప్రామాణికాలకు అనుగుణంగా పరికరాలను 
కుప్పలు తెప్పలుగా కనిపెడుతున్న
ఎండు కట్టెల పొయ్యలు, మట్టి కుండలో కూడు వండుతూనే వున్నాయి...
జనవాసానికి దూరంగా వారిని వారు వెలి వేసుకుంటున్న తీరు
ఆచార వ్యవహారాల పట్ల వారికి వున్న అమితమైన ప్రేమకు 
అందమైన వారి అమాయకత్వానికి అద్దం పడుతాయి...
మిణుకు మిణుకు అద్దాలతో, రంగురంగుల పూసలతో,
తళతళ మెరుపులతో వస్త్రాలను అద్బుతంగా అల్లే వీరి నైపుణ్యానికి,
నిండైన ఆభరణాల అలంకార ప్రావీణ్యానికి ఎవ్వరైనా ముగ్ధులు కాక మానరు...
విధిగా సాగే సామూహిక సంబరాలు, ఆట పాటల
అందమైన నృత్యాలు కూడా వీరి సంస్కృతిలో భాగమే...
నవజీవన రాగాన్ని ఆలపిస్తూ ఆచార వ్యవహారాలను అవసరాలకు 
అనుగుణంగా మార్చుకుంటూ...మొత్తంగా మరచిపోతున్న మనం
యథావిధిగా సంసృతిని సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నా
వీరి నుంచి కొంతలో కొంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది....


కామెంట్‌లు
Rathod Sravan lecturer చెప్పారు…
నమస్కారం సర్
చాలా బాగుంది ‌మేడం ఆర్టికల్
Rathod Sravan lecturer చెప్పారు…
చాలా బాగుందండీ.. రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం