"జాతిపితమహాత్మాగాంధీజీ గారి 75 వ వర్థంతి-పద్యాంజలి"!!!;- "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-- చరవాణి:- 6300474467
 01.
తే.గీ.

సత్యధర్మమ్మువీడనిసద్గుణుండు
శాంతితోస్వేచ్ఛనందించెసాధకుండు
బోసినవ్వులుచిందించెపూర్ణయశుడు
వందనమ్ములుగాంధీజియందుకొనుము!!!

02.
తే.గీ.
నీదుచూపులోకరుణయేనిండియుండి
హృదయమందునసద్భావసుధలుకురిసె
తెల్లదొరలనుతరిమినధీరవీర
వందనమ్ములుగాంధీజియందుకొనుము!!!

03.
తే.గీ.
హింసమార్గమ్మువలదనిహితవుబలికి
శాంతిమంత్రమ్మెకర్తవ్యసాధనమని
దేశజనులకునందించెదీక్షతోడ
వందనమ్ములుగాంధీజియందుకొనుము!!!

04.
తే.గీ.
భరతమాతనునిష్ఠతోప్రతిదినమ్ము
నమ్మిగొల్చినసుగుణాలసొమ్ముసుమ్మి
దారిదీపమైవెలిగినదార్శనికుడు
వందనమ్ములుగాంధీజియందుకొనుము!!!

05.
తే.గీ.
ముందుతరములకాదర్శమూర్తివయ్యి
విశ్వకీర్తితోనిరతమ్మువెలుగులీని
మనదుదేశపుగౌరవమినుమడించె
వందనమ్ములుగాంధీజియందుకొనుము!!!కామెంట్‌లు