యుగపురుషుడు!; -డా,పి.వి.ఎల్. సుబ్బారావు 9441058797.
30 జనవరి,
మహాత్ముని వర్ధంతి,
ఆయనకు నివాళి!
===================
 1. ఒక ఆత్మశక్తి విశ్వాన, 
             శిరసెత్తి నిలిచింది!
   
  దమన ఆయుధశక్తి,
       నిర్వీర్యమై తలవంచింది!   

   అతడు సత్య మోహన్ ,
       నీతి నియమాల దాస్!
 
  కరం (కర్మ )ఆచరణాన,
 మచ్చలేని పున్నమి చంద్!

   "గాంధీ గా  జనహృదయ,
       సువర్ణసింహాసనాధీశ్!

2. బాధకి లొంగని ధ్యానం,
      లక్ష్యం మరువని మౌనం!
 
   జాతిని వెన్ను తట్టే ఆచూపు,
   మనం.స్మరిస్తే చాలు బాపు !
,
   ఓ మహాశక్తి సాక్షాత్కారం,
    సత్వర సమస్య పరిష్కారం! 

   అతడీ దేశ జాతిపిత, 
        సర్వదా విశ్వాదర్శనేత !

  దేశస్వాతంత్ర్య సమరాగ్రనేత,
       జన స్వాతంత్ర్య విధాత!

3 వ్యక్తిత్వవికాసమంటే,మనో,
చైతన్యమన్న మౌనవ్యాఖ్యాత!
  
మతాలకు అందని, సడలని, దైవవిశ్వాసం ఆయనసొంతం

ఈశ్వర్ అల్లా తేరే నామ్,
 స్త్రోత్రం,  ఓ మహా మంత్రం!

సత్య అహింసల సవ్యసాచి,
  ఆయన పోరు, సాగర హోరు !

సత్యాగ్రహాల, ఉపవాసాల, జోరు,శరీరాన,వన్నెతగ్గనిసౌరు!

4. సబ్ కో సమ్మతి దే భగవాన్,
    ప్రార్ధన తీరు మానవత వేరు!

శాఖాహారం అతనిమహాసత్వం,
  సత్యభాషణం నిజ వ్యక్తిత్వం! 

లక్ష్యసాధనే కాదు,అనుసరించే,
    తీరు, జగాన నిలిచి తీరు!
 
మహాత్ముడు గా ఎదిగిన వ్యక్తి, 
    ధరిత్రి పునీతం చేసిన శక్తి !

కరెన్సీ పైన చిత్రమే కాదు, ట్రాన్స్పరెన్సీకీ చెరగని చిహ్నం!

5. చివరి క్షణంలో "అమ్మా" ,
  అనక "రామా" అన్న ఆ ఆత్మ!
  
   పరమాత్మలో కలిసింది,
         మహాత్మగా నిలిచింది !

  ఆయన ధన్య జయంతి, ప్రపంచ అహింసా దినోత్సవం! 

ఆయన దివ్య వర్ధంతి ,
మృతవీరులస్మారకదినోత్సవం!
 
కర్మయోగి,యుగపురుషుడు, అతడ్ని స్మరిద్దాం,అనుసరిద్దాం!
________


కామెంట్‌లు