దొంగ భక్తులు; - ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
మనం చాలా మందిని చూస్తూ ఉంటాం  జడలు విరబూచుకొని  నూనె కూడా రాయకుండ  శరీరం నిండా  బూడిద పూసుకుని  మోక్షం కోసం తానేదో ప్రయత్నం చేస్తున్న వాడివలే భ్రమలు కల్పిస్తూ  గొందు సందులన్నీ  తిరుగుతూ ఉంటారు  యోగము అంటే అర్థం తెలియదు  పేరు ప్రఖ్యాతలు ఎందుకొస్తాయో ఎలా వస్తాయో తెలియదు  నిజానికి  మనిషిగా బ్రతకడం ఎలాగో కూడా తెలియని  వాడు  బిచ్చగాడు కూడా చేయని  విన్యాసాలను చేస్తూ వెళుతూ ఉంటారు  వాళ్లను చూస్తే చులకన భావం తప్ప గౌరవభావం రాదు. అందరూ వచ్చి చూడడం తప్ప  కనీసం మంచినీళ్లు ఇచ్చేవారు కూడా దొరకరు  అలాంటివాడు  వీధిలోకి  వస్తూ ఉంటేనే చిన్నపిల్లలు దడుచుకుంటూ  ఉంటారు. అలాంటివారు సన్యాసులుగా చలామణి అవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎలా సాధ్యం  పైపై చమక్కులను చూసి మోసపోవడానికి మానవుడు అమాయకుడు కాదు కదా. ఈ ఆకారాన్ని చూసి అతని మనసును అర్థం చేసుకొని  మోక్షాన్ని ప్రసాదించవలసిన వాడు భగవత్ స్వరూపం  ఆయనకు ఇతని పద్ధతి ఎలా అనిపిస్తుంది  సన్యాసి అంటేనే  సత్ న్యాసి  ఏది శాశ్వతంగా నిలిచి ఉంటుందో ఆ పదార్థాన్ని  ఒక ప్రక్కగా దాచుకున్న వాడిని సన్యాసి అని పిలుస్తారు  ఉపవాసాలు ఉంటారు  ఆ పదానికి అర్థం కూడా తెలియదు  వాసము అంటే నివాసం ఉండడం  ఉప అంటే ప్రక్కన  రెండు మూడు తరగతులు చదివే కుర్రవాళ్ళు  అధ్యాపకుల తొడ మీద కూర్చుని ఎలా పాఠం నేర్చుకుంటూ ఉంటారో అలా భగవత్ స్వరూపానికి ప్రక్కగా కూర్చుని వారిని తప్ప వేరే మనసులో ధ్యానించడం తెలియని వారు  దానికి ఉపవాసం  భోజనం లేకుండా ఉండడం అని అర్థంలో మాట్లాడుకుంటూ ఉంటారు.


వీరి జీవిత ధ్యేయం ఏమిటి  స్వర్గ లోకంలోకి వెళ్లి స్వర్గ సుఖాలు అనుభవిస్తూ  అక్కడ కాంతలను ముద్దు పెట్టుకోవడం  వీరికిఒళ్ళు  విరుచుకోవడం తప్ప  యోగ విద్య అన్న శబ్దానికి అర్థం తెలియదు  ఇంక యోగం ఎలా చేస్తారు  ముందు పద్మాసనం వేసి కూర్చోవడం దగ్గర నుంచి  గాలి పీల్చడం, గాలి వదలడం సమర్థవంతంగా పద్ధతి ప్రకారం చేయాలి. మనసును ఏకీకృతం చేసుకోవాలి  ఓంకారముతో  ప్రారంభించాలి  ప్రాథమిక విషయాలు కూడా తెలియకుండా  కాళ్లు చేతులు ఊపుకుంటూ పొట్టను పైకి కిందకి తిప్పుతూ  తన ఇష్టం వచ్చిన విన్యాసాలు చేస్తూ పోతే అదంతా యోగం కిందకి వస్తుందా అని చూసేవాళ్ళు నవ్వుతారు అని కూడా ఆలోచించకుండా చేసే ప్రక్రియలను చూస్తే  ప్రజలు ఛీ కొడతారు. అలాంటి వాడిని భగవంతుడు మెచ్చుకుంటాడా  మోక్షాన్ని ప్రసాదిస్తాడా? జరిగే పనేనా? ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వేమన వ్రాసిన పద్యం  మీరు ఒకసారి చదవండి.


"జడలు దాల్చుటెల్ల జగము ఛీ యనుటెల్ల
వడలు విరుచుటెల్ల యోగ మెల్ల 
మోక్షకాంతబట్టి ముద్దాడు  కొరకురా..."

 

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం