శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఉపనిషద్ అంటే అర్థం దగ్గరగా కూర్చోవటం.బ్రహ్మవిద్య తెలుసు కోవడం కోసం గురువు దగ్గరే ఉండటం కానీ కాలక్రమేణా దీని అర్ధం మారింది.సంస్కృతంలోని విశిష్ట సాహిత్యాన్ని ఆత్మ జీవుడు బ్రహ్మ మొదలగు వాటిని గూర్చిన వివరములు తెలిపేవాటిని ఉపనిషత్తులు అన్నారు.వేదాల తర్వాత రాయబడినవి.వేదాంతం అని కూడా అంటారు. కీ.శే.దేశ్ పాండే మరాఠీలో మృత్యుపనిషద్ రాశారు.సంస్కృత సాహిత్యంలో 40సంస్కారాల పేర్లు ఉన్నాయి.అందులో ఒకటి ఉపనిషద్(హిందీ లో)
ఊహాపోహ అనే పదం లో ఊహ అంటే అనుకూల తర్కం.అపోహ అంటే ప్రతికూల తర్కం.అంటే ఒక విషయం పైనిశ్చయంగా ఏదీ తేల్చుకోలేక పోవటం.తర్క వితర్కాలు మల్లగుల్లాలు పడటం అనే అర్థంలో వాడుతున్నాం.

కామెంట్‌లు