న్యాయాలు-29
కఫోణి గుడ న్యాయము
*****
కఫోణి లేదా కపోణి అనే పదానికి మణి బంధము లేదా మోచేయి,కుర్పరము,కూర్పరము,కఫణి అనే అర్థాలు ఉన్నాయి.
గుడము అంటే బెల్లము,అమృత రసాలము.
మోచేతికి అంటుకున్న కొంచెమంత బెల్లం పాకమును వదిలి వేయడమో,కడిగేయడమో చేయాలి.కానీ దాని మీద ఆశతో పలుమార్లు నాకడానికి చేసే ప్రయత్నమే ఈ కపోణి లేదా కఫోణి గుడ న్యాయము.
నాలుకతో మోచేయిని అందుకోవడమే కష్టం. అక్కడ ఎంతో మిగిలి ఉందనే భ్రమలో అందుబాటులో లేని మోచేతి మీద బెల్లం పాకాన్ని నాకేందుకు ప్రయత్నించడమనేది వృధా ప్రయాసే కదా.
ఇలాంటి అమాయక ఆశా జీవులను, భ్రమల్లో ఉన్న వారిని తేలికగా మోసం చేసే వంచకులు కొందరు ఉంటారు.
బెల్లం పాకంలాంటి తీయని మాటలతో మభ్యపెట్టి తమకు కావలసిన పనులను చేయించుకుని , అవసరాలను తీర్చుకుని ఆ మోచేతితోనే పొడుస్తారు .
మోసకారి రాజకీయ నాయకుల రూపాలు వీరు. తీయని వాగ్ధానాల ఆశ చూపి ప్రజల ఓట్లు దండుకునే వాళ్ళు ఈ కోవకు చెందిన వారే. వీరి వాగ్ధానాలు ఊరిస్తూ ఉంటాయి.వాటి ఫలితాలను పొందుతామనే ఆశతో అమాయకులు పలుమార్లు నమ్ముతూనే ఉంటారు.
ఇలాంటి వారిని ఉద్దేశించి ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి