ప్రసిద్ధ వ్యక్తులు! అచ్యుతుని రాజ్యశ్రీ
 విఖ్యాత కవి రచయిత లూయీ స్టీవెన్సన్ వాతావరణ మార్పు ఆరోగ్యం కోసం సామోవా అనే గుట్టప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నాడు. అతను చెప్పే కబుర్లు కథలు ఆకొండప్రాంతవాసుల్ని  బాగా ఆకట్టుకునేవి.అక్కడ ఉన్న ఓడరేవు నుంచి  తమ పల్లెలకు సామాన్లు తెచ్చుకోవాలి అంటే రోడ్డు అంతా రాళ్ళు రప్పలమయం! ఇది చూసిన స్టీవెన్సన్ తన సొంత ఖర్చు తో మంచి పక్కారోడ్ వేయించారు.సామోవా ప్రాంతంలో ఉన్న ఆప్రజలుఆయనపై ప్రేమ భక్తి గౌరవం చాటుతూ"ప్రేమించే హృదయపు మార్గం" అని ఆబాటకి పేరు పెట్టారు. 
యు.ఎస్.32వ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ తన సెక్రెటరీ టైప్ చేసి తెచ్చిన ప్రతిపేపర్ని ఆమూలాగ్రం పరిశీలించి సంతకం పెట్టేవాడు. కొత్తగా ఓరెండు వాక్యాలు చేర్చేవాడు.పాపం సెక్రెటరీ మళ్ళీ టైప్ చేసి తెస్తే కొత్తది ఓవాక్యం గిలికేవాడు.ఓరోజు ఉండబట్టలేక సెక్రెటరీ అడిగాడు "సర్! మీరే కదా నాకు అంతా డిక్టేట్ చేశారు. కష్టపడి టైప్ చేసి తెస్తే మళ్ళీ ఏవో కొత్త వాక్యాలు  మీదస్తూరీతో రాస్తారు ఎందుకు?" రూజ్వెల్ట్ నవ్వుతూ  అన్నాడు "అమెరికన్ ప్రెసిడెంట్  తనకోసం స్వయంగా రెండు వాక్యాలు రాశారు అని  దీన్ని చదివేవ్యక్తి పొందే ఆనందం  అమూల్యం! నారాతవల్ల పేపర్ చెడిపోదు.ఈలేఖ అందుకునే వ్యక్తి పొందే ఆనందం అతని ఆత్మీయత ప్రేమ కృతజ్ఞతలు విలువకట్టలేనివి!" 
రూజ్వెల్ట్ మహామేధావి మాటకి మాట చురకలు వేసేవ్యక్తి.పత్రికావిలేఖర్ల సమావేశం లో మెన్కెన్ అనే అతను ఆయన్ని తీవ్రంగా దుయ్యబట్టాడు.అతని సీమటపాకాయ వాచాలత్వంని రూజ్వెల్ట్ నవ్వుతూ తన ప్రసంగంలో ముందు బ్రహ్మాండంగా మెన్కెన్ ని ఉబ్బేశాడు.ఆపై తుఫాను లా పత్రికావిలేఖర్లపై విరుచుకు పడ్డాడు. ప్రెస్ వారంతా తెల్లబోయి"ప్రెసిడెంట్ మనమీద బాంబుల దాడి చేస్తున్నారు?!"అని మల్లగుల్లాలు పడసాగారు.కానీ ఆయన వాడిన మాటలు మెన్కెన్  తన జర్నలిజం ఇన్ అమెరికా  అనే పుస్తకం లో ఇలా రాశాడు "అమెరికన్ ప్రెస్ మూర్ఖత్వం  పిరికితనం సంస్కృతిహీనత్వంకి దర్పణం!" ఆమాటలనే రూజ్వెల్ట్ ఇప్పుడు వాడి మెన్కెన్ ని పాపం నోరు తల ఎత్తనీయకుండా చేశాడు. దొంగకు తేలు కుట్టినచందంగా గప్చిప్ గా ఉంటే మిగతా విలేఖర్లు ముసిముసినవ్వు తో చప్పట్లు కొట్టారు. 🌺

కామెంట్‌లు