సునంద భాషితం ;-వురిమళ్ల సునంద,ఖమ్మం
 న్యాయాలు -10
అండ కుక్కుటీ న్యాయము
*******
 అండము అంటే గుడ్డు , కుక్కుటి అనగా కోడి. కోడి లేకుంటే గుడ్డు లేదు.గుడ్డు లేనిదే కోడి ఉండదు. 
అంటే గుడ్డు లేకుండా కోడి పుట్టదు.కోడి లేకుండా గుడ్డును  ఊహించుకోలేము .
ఇలా గుడ్డు ముందా? కోడి ముందా? అనే  తర్కం  తరచూ జరుగుతూనే ఉంటుంది ఇలాంటిదే "మరోటి చెట్టు ముందా!విత్తు ముందా?" అనే సందేహం. ఈ ధర్మ సందేహాలకు రకరకాల సమాధానాలు వస్తూ ఉంటాయి.
అదంతా శాస్త్రవేత్తల పరిశోధనలో  తేలే అంశాలు..
కానీ ఆస్తికులు, నాస్తికులు ఈ విషయాల పట్ల తమ తమ వాదనలను వినిపించడం చూస్తూ ఉంటాం. ఇక సామాన్యుడికైతే ఎటూ పాలుపోని  పరిస్థితి.
ఇదిగో ఇలా తర్కానికీ,వాదానికీ అందని వాటిని గురించి  ఆలోచించడం అనవసరమనీ, అవి రెండూ ఒకటి ఉంటే మరొకటి ఉంటాయనడానికి ఉదాహరణగా ఈ అండ కుక్కుటీ న్యాయాన్ని గురించి చెబుతూ ఉంటారు.
నిప్పు లేనిదే పొగ రాదనీ  కొందరంటే నిప్పు లేకున్నా పుకార్ల పొగ వస్తూనే ఉంటుందని మరి కొందరు అనడం , వినడం కూడా చూస్తూ ఉంటాం అది వేరే సంగతి అనుకోండి.
ఏది ఏమైనా అండ కుక్కుటీ న్యాయమును ఇలాంటి వాటికి ఉదాహరణగా  చెప్పుకోవచ్చు.

ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు