సుప్రభాత కవిత ; -బృంద
మార్పుకోసం తూర్పువేపు
సాగే జీవన పయనం...

అంతరంగంలో ఆత్మవిశ్వాసం
కదిలే అడుగులకు  బలం

ఎదురుపడ్డ  సమస్యలను
సహనంతో పోరాడితేనే గెలుపు

మనసులో కలిగే ఆలోచనలు 
నిరంతరం వెలిగే చైతన్య జ్యోతి

ఆత్మ విశ్వాసం  అంతరిస్తే
ఆటంకాలు అధిగమించలేం

జీవితం ప్రశ్నార్థకమైనా
సమాధానంకోసమే జీవనం

మనిషిలో కాక మనసులో
మార్పు వస్తే విజయం 

మార్చలేని విషయాలకు
అనుగుణంగా మారితే లౌక్యం

మంచి మాట మంచి నడత
మన అమ్ముల పొదిలో అస్త్రాలు

సహనం సహకారం సాదరం
మనల్ని గెలిపించే సూత్రాలు

తడబడ్డా ఆగిపోక
కిందపడ్డా ఓడిపోక

పవనాలు మారినా
పయనాలు  మారక 
సాగిపోవడమే కర్తవ్యం

సుఖదుఃఖాలు  చక్రభ్రమణాలు
ఒకటి ముందైతే మరోటి వెనకే

ఆశతో జీవించడమే
జీవితానికి పరమార్థం

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు