వానచినుకు కోసం
పుడమి వేచినట్టు
చినుకు పడగానే
పులకరించి చిత్తైన నేలతల్లిలా
అరుదైనఅందాల ఆనందాలు
ఆవహించిన అంతరంగం
వెలుగుల అలికిడికి
కలుగులో దూరిన చీకటి
ఎదలోయల కోయిలపాట
మదిముంగిట మయూరాల ఆట
మధుర భావాల జలపాతాలలా
జాలువారే మమతల మాలలు
పచ్చనికాంతులు పరచిన
వెచ్చని వెలుగుల జాతర
కరిగిన నిన్నల కలతల మూటకు
ఏటినీటి సన్నటి అలల జోలపాట
ఇలను తాకిన కిరణాలకు
తలను వంచి అభివాదం
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి