1. త్రిగుణాలు-3.
సత్వం, రజస్సు, తమస్సు.
2. త్రిలింగం-3
శ్రీశైలం, దాక్షారామం, కాలేశ్వరం లేదా శ్రీకాళహస్తి.
3. నవబ్రహ్మలు-9.
మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, వామదేవుడు.
4. నవరత్నాలు-9
వజ్రం, వైడూర్యం, గోమేధికం, పుష్యరాగం, మరకతం, మాణిక్యం, నీలం, ప్రవాళం, ముత్యం.
5. పంచ మహా పాతకాలు -5.
బంగారం దొంగిలించడం, సురాపానం, బ్రహ్మ హత్య, గురుపత్ని గమనం, మహాపాతకులతో సహవాసం.
6. పంచ మహా వ్రతాలు-5
అహింస, సత్యం, ఆస్తేయం (దొంగలించకుండా ఉండుట), బ్రహ్మచర్యం, అపరి గ్రహం (దానాలు స్వీకరింపకుండటం).
సంఖ్యా పదావళి.;- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి