ఇదే నిజమైన భక్తి.- యామిజాల జగదీశ్
 కంటిచూపు లేని ఓ మనిషి ఆలయానికి వెళ్ళాడు.
అతనిని చూసి పూజారి "అయ్యా! మీకు కంటిచూపు లేదు కదా. కొండెక్కి క్యూలో నిల్చుని ఇంత శ్రమపడి వచ్చారుగా. దేవుడిని  మీరు దర్శించలేరు కదా?" అని అడిగారు.
అప్పుడా అంధుడు "స్వామీ! నేను దేవుడ్ని దర్శించడం వల్ల ఆయనకేం లాభం? దేవుడు నన్ను చూస్తే చాలు. నా కష్టాలు తీరుతాయని నమ్మి నేనొచ్చాను" అన్నాడు.
ఇదే నిజమైన భక్తి. 
ఇదే నిజమైన తపన. 
ఇదే నిజమైన నమ్మకం.

కామెంట్‌లు