పెద్దపల్లి జిల్లాలోని నర్సింహుల పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాసిన మూడు పుస్తకాలను జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి మాధవి మేడం గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. చిన్నప్పటినుండే మంచి సాహిత్యం చదవడం ద్వారా పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. వేల్పుల శ్రీలత నిజమైన స్నేహితులు అనే పిల్లల కథల పుస్తకమును, నాగుల శ్రీనిత్య ప్రకృతి ఒడిలో అనే మణిపూసల కవితలను, బుర్ర వైష్ణవి ఆడపిల్ల మణిపూసల శతకమును రాయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి వారిని రచనా రంగం వైపు ప్రోత్సహించిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కందుకూరి భాస్కర్ ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెడుతూ ఈ పుస్తకాలను చక్కగా రాశారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గర్ల్స్ చైల్డ్ ఆఫీసర్ అనురాధ మేడం, సెక్టోరియల్ అధికారి డా. పి.యం.షేక్ పాల్గొనగా, కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ పుస్తకాల ముద్రణకు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ దయానంద రెడ్డి రేణుక ఆర్థిక చేయుతను అందజేయడమైనది. ప్రముఖ కవి, గాయకుకుడు, ఉపాధ్యాయుడు జాడి శ్రీనివాస్ ప్రకృతి ఒడిలో మణిపూసల శతకమును సమీక్ష చేశారు. ఆడపిల్ల శతకమును ప్రముఖ సాహితీవేత్త, ASI దుబ్బ భాస్కర్ రావు గారు పరిచయం చేయగా, నిజమైన స్నేహితులను కథల పుస్తకమును ప్రముఖ బాల కథారచయిత సంగనభట్ల చిన్న రామకిష్టయ్య పరిచయం చేశారు. కార్యక్రమంలో SMC చైర్మన్ రాజమల్లు, సర్పంచ్ అడువాల అరుణ జ్యోతి, ఉపసర్పంచ్ కోమలత, ఎంపీటీసీ దాడి సదయ్య, ఉపాధ్యాయులు రాజారాం సతీష్, కె.జ్యోతి, రమేష్ నాయక్, పుష్పలత, స్వరాజ్యలక్ష్మి, రాజేష్, జ్యోతి, కృష్ణ హరి మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల పుస్తకాల ఆవిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి