కృష్ణదేవరాయల వారు 16 వ శతాబ్దంలో ఉన్న అన్ని భాషలలో'లెస్స'(గొప్పది) అయినది తెలుగు భాష అన్నారు. కలకండ లాగా తియ్యగా తెలుగు మాట్లాడుతుంటే అని కూడా తన అనుభూతిని ప్రకటించారు. కండ (పుష్టి) కలిగిన భాష అని కూడా బహుభాషా రహస్య వేత్తగా ధ్రువపత్రం ఇచ్చారు. అంతమాత్రాన తక్కిన భారతీయ భాషలు (తక్కువ) అని భావించరాదు.
తెలుగులోనే సంస్కృతం ఏమది వర్ణాలు కలిసిపోయాయి. తెలుగు సంస్కృతాలు కలిసిపోవడం వల్ల ఏర్పడిన ఉచ్చారణ పటిష్టత, గాంబీర్యం, వ్రాసినట్లు పలకటం, పలికినట్టు వ్రాయడం, ప్రాస మాధుర్యం, యతి సౌందర్యం-ఇవన్నీ సాధారణ జన వ్యవహారంలోనే కనిపించే భాషగా తెలుగు విశిష్ట స్థానాన్ని పొందింది. వేదాన్ని సమగ్రంగా (శిక్ష) లో చెప్పబడిన తీరుగా ఉచ్చరించే ఏకైక భారతీయ భాష తెలుగే అన్నది పండితులందరూ గుర్తించిన అంశం. రామాయణ భారత భాగవతాలు సంపూర్ణంగా అనువాదం పొందిన భాష కూడా తెలుగు మాత్రమే. ఒకప్పుడు పెద్ద బాలశిక్షను చదివితే చాలు. తెలుగు భాషలోని ఇంపు సొంపులు అన్ని తెలిసేది. ఆ రోజుల్లో పిల్లలకు నేర్పిస్తూ ఉండేవారు.
తెలుగు భాష మాధుర్యం.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి