నిజాయితీతో మేలు;-- యామిజాల జగదీశ్
 నిజాయితీగా ఉన్న వారు మంచిగా బతకలేరని ఎలా చెప్పగలం? కానీ కొంతమంది వారిని అలా మంచిగా ప్రశాంతంగా ఉండనివ్వరనేదే నిజం!
పది మంది ఒకేలా ఉన్నప్పుడు ఒకరు మాత్రం భిన్నంగా ఉండటాన్ని ఈ లోకం ఎలా స్వీకరిస్తుంది? ఎలా ఆదరిస్తుంది?
అందరి చొక్కాలోనూ మరక ఉన్నప్పుడు ఒకరు మాత్రం మల్లెపూవులాంటి తెల్ల రంగు వస్త్రాలను ధరించడానికి ఎలా అనుమతిస్తారు? తమ మరకను అతనిమీదా పూయడానికి ప్రయత్నిస్తారుగా?
ఈ కాలంలో నిజాయితీగా ఉండటం కష్టంతో కూడుకున్నదే. మరో మాటలో చెప్పాలంటే కఠినమైంది. కానీ అందువల్ల లభించే ఫలితాలు అధికం.
నిజాయితీగా వ్యవహరించేవారు హాయిగా పడుకుంటారు. నడుం వాల్చగానే నిద్ర వచ్చేస్తుంది వారికి. 
ఎంత పాపం, పుణ్యం చేసేమన్న లెక్క వారికి ముఖ్యం కాదు.
తప్పు చేసామన్న బాధ లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తారు. 
డబ్బు ఉందో లేదో 
వారు నిజాయితీపరులు అనే పేరుంటుంది.
డబ్బు పరంగా లోటు ఉండొచ్చు కానీ వారు మంచిగా బతకలేదు అని చెప్పలేముగా. 
ప్రశాంతమైన జీవితం మంచి జీవితమే కదా!
ప్రపంచంలో కఠినమైన విషయం ఇతరుల నమ్మకాన్ని పొందడం. అయితే నిజాయితీపరులకు అది తేలికగా లభిస్తుంది. 
మనం నిజాయితీగా ఉండాలని చెప్పడం ఇతరుల కోసం కాదు. 
ఇతరులు మనల్ని ప్రశంసించాలనీ కాదు. మన మనస్సాక్షి కోసం....!

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం