సూది పడే శబ్దం వినిపిస్తుందా?;--- యామిజాల జగదీశ్
 1. 
ఫీల్డ్ మార్షల్ మానెక్ షా ఓమారు అహ్మదాబాదులో ఇంగ్లీషులో తమ ప్రసంగం మొదలుపెట్టారు.
"గుజరాతీలో మాట్లాడండి ....మీరు గుజరాతీలో మాట్లాడితేనే వింటాం" అని ప్రేక్షకులు గోల చేశారు.
అప్పుడాయన తమ ప్రసంగాన్ని ఆపి ప్రేక్షకుల వంక చూస్తూ ఇలా జవాబిచ్చారు.
 "మిత్రులారా! నా సుదీర్ఘ సర్వీసులో ఎందరితోనే ఇంటరాక్ట్ అయ్యాను. సైన్యంలో ఉన్న సిఖ్ రెజిమెంట్ నుంచి పంజాబీ నేర్చుకున్నాను. మరాఠీ భాషను మరాఠా రెజిమెంట్ నుంచి, మద్రాస్ వారి నుంచి తమిళం, బెంగాలీయుల నుంచి బెంగాలీ, అంతెందుకు గూర్ఖా రెజిమెంట్ నుంచి నేపాలీ ఇలా ఎన్నో భాషలు నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తు గుజరాత్ నుంచి ఒక్క సైనికుడూ ఎదురపడలేదు నాకు గుజరాతీ నేర్పించడానికి" అని అనడంతో అక్కడ నిశ్శబ్దం నెలకొంది. 
ఇటువంటి నిశ్శబ్ద వాతావరణంలో  కింద పడ్డ సూది శబ్దంసైతం వినిపిస్తుందనడంలో ఏ అనుమానమూ లేదు. 
2
ఫ్రాన్స్ దేశానికి విమానం ద్వారా చేరుకున్న 83 ఏళ్ళ అమెరికన్ రాబర్ట్ కస్టమ్స్ అధికారులకు తన పాస్ పోర్ట్ చూపించడానికి కొంత సమయం తీసుకున్నారు.
"మీరు ఫ్రాన్సుకి తొలిసారిగా వస్తున్నారా" అని ఓ అధికారి వ్యంగ్యంగా అడిగారు. 
"కాదు. ఇంతకు పూర్వమూ వచ్చాను" అన్నారాయన.
"అలాగైతే మీ పాస్ పోర్టుని సిద్ధంగా ఉంచుకోవాలన్న విషయం తెలిసుండాలి కదా" అన్నారు అధికారి.
"నిజమే. కానీ క్రితంసారి వచ్చినప్పుడు పాస్ పోర్ట్ చూపించాల్సిన అవసరం లేకపోయింది" అన్నారాయన.
"అలా అవకాశమే ఉండదే. అమెరికన్లు ఇక్కడికొచ్చేటప్పుడు తమ పాస్ పోర్టుని తప్పనిసరిగా చూపాలన్నది ఎప్పుడూ ఉన్న నిబంధనే" అని కోపంగా చూశారా అధికారి.
కొన్ని సెకండ్ల పాటు ఆ అధికారి వంక తీక్షణంగా చూస్తూ రాబర్ట్  ఇలా అన్నారు...
"రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మీ దేశానికి విముక్తి కల్పించడానికి 1944 జూన్ ఆరో తేదీ తెల్లవారుజామున 4.40 గంటలకు ఒహోమా సముద్రతీరాన నేను చేరుకున్నప్పుడు నా పాస్ పార్టుని చూపపాలనుకున్నప్పుడు ఒక్క ఫ్రెంచ్ జాతీయుడూ అక్కడ లేరు" అన్నారు.
ఈ మాటతో అక్కడ నెలకొన్న నిశ్శబ్ద వాతావరణంలో కింద పడిన సూది శబ్దం వినిపించడం సాధ్యమే.
3
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవాహర్ లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ప్రప్రథమ సైనిక దళపతిని ఎన్నుకోవడానికి సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు....
"మనకు సైనిక నిర్వహణకు సంబంధించి అనుభవం లేకపోవడం వల్ల ఓ ఇంగ్లీష్ సైనికుడినే మన ఆర్మీకి దళపతిగా నియమించాలనుకుంటున్నాను" అన్నారు నెహ్రూ.
బ్రిటీష్ వారి వద్ద సేవ చేస్తూ వచ్చిన అలవాటుతో అందుకు అందరూ అంగీకారమే అన్నట్టు తల ఊపారు.
కానీ నాథు సింగ్ రాథోడ్ అనే ఓ సైనిక ఉన్నతాధికారి తనకు మాట్లాడే ఆవకాశం ఇవ్వవలసిందిగా కోరారు.
స్వయంగా ఆలోచించే ఈ వైఖరిని చూసి నెహ్రూ ఆయనకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.
"సార్. మనకు దేశాన్ని పాలించే అనుభవంకూడా లేదు. మనం ఓ ఆంగ్లేయుడినే మన దేశానికి ప్రధానిగా నియమించుకుంటే సరిపోతుందిగా" అని.
ఈ మాటతో అక్కడ నెలకొన్న నిశ్శబ్ద వాతావరణంలో సూది పడ్డ శబ్దం తప్పక వినిపించే తీరుతుందనడంలో ఏ సందేహమూ లేదు.
ఊహించని ఈ అభిప్రాయం నుంచి తేరుకోవడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత నెహ్రూ మాట్లాడుతూ
"మరి మీరే మన దేశ తొలి సైనికాధ్యక్షుడిగా మీరుంటారా" అన్నారు నెహ్రూ.
"లేదు సార్. మన దగ్గర సాటి లేని శక్తిసామర్థ్యాలు కలిగిన లెఫ్టినంట్ జనరల్ కరియప్పా ఉన్నారు. ఆయనే ఈ పదవికి అన్ని విధాల అర్హులు" అని రాథోడ్ అన్నారు. 
ఇలా కరియప్పా మన దేశానికి తొలి సైనికాధ్యక్షుడయ్యారన్నాది చరిత్ర.
ఈ సందర్భంలోనూ అక్కడ నెలకొన్న నిశ్శబ్ద వాతావరణంలో సూది పడ్డ శబ్దం వినిపించకమానదుగా!


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం