గుణపాఠం!అచ్యుతుని రాజ్యశ్రీ

 భరద్వాజ మహర్షి ఏకైక కొడుకు యవప్రీతుడు.వేదజ్ఞానం పొందాలని కఠోర తపస్సు చేశాడు. ఇంద్రుడు నచ్చ చెప్పి నా వినిపించుకోలేదు. అగ్నిని తనచుట్టూ రగిల్చిఘోరతపస్సు ఆరంభించాడు. ఇకచేసేదేమీలేక ఇంద్రుడు వృద్దబ్రాహ్మడి వేషంలో భాగీరథి నదీతటంపై కూచున్నాడు. యవప్రీతుడు స్నానంచేయటానికి రాగానే ఆవృద్ధుని చూశాడు. ఆయన ఒక పిడికెడు ఇసుకను తీసుకుని నదిలో వేస్తూనే ఉన్నాడు.యవప్రీతుడు ఆశ్చర్యం గా అడిగాడు "ఎందుకు తాతగారు!అలా వేస్తున్నారు?" " ఇలావేసి ఇసుక తో వంతెన కట్టాలి అనుకుంటున్నాను." అతను పెద్దగా నవ్వుతూ"ఏంటీ! ఇలావేగంగా ప్రవహించే నదిలో వంతెన కట్టడం అసాధ్యం " అనటంతో వృద్దుడిలా అన్నాడు " నీవు తపస్సుతో వేదజ్ఞానం పొందాలి అనుకుంటున్నావు కదా?మరి నేను ఇలా చేస్తూ పోతే ఎందుకు సాధ్యం కాదు?"అంతే యవప్రీతుడికి ఆయన ఇంద్రుడు అని  తనకు బుద్ధి చెప్పాలని వచ్చాడని అర్ధం ఐంది. అంతే వేదాలని మామూలుగా చదవటం ప్రారంభించాడు.మనకు మంచి ప్రతిభ జ్ఞానం ఉన్నా టెన్త్ సర్టిఫికెట్  డిగ్రీ లేకుంటే ఉద్యోగం దొరకదు🌺
కామెంట్‌లు