లక్ష్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాస్ లో పిల్లలని "మోదీజీ ప్రసంగం విన్నారా? పరీక్షపె చర్చలో ఏంతెలుసుకున్నారు?" అని టీచర్ అడిగారు. ఓ అన్నారు అంతా!"భవిష్యత్తులో మీరు ఏంకావాలను కుంటున్నారు?"ఒక్కోరు ఒక్కో జవాబు! యాక్టర్ ఇంజనీరు డాక్టర్ ఐఎఎస్..ఒక అమ్మాయి మాత్రం అంది"నేను టీచర్ ని కావాలని అనుకుంటున్నాను. మీరు పడేశ్రమ తెలుసు.మీపిల్లలకన్నా మిన్నగా విద్యా ర్థులగూర్చి ఆలోచిస్తారు. మాఅమ్మ నాన్న ఉద్యోగం చేస్తున్నారు అంటే మీరు పెట్టిన భిక్షకదా?ఓకవి రచయిత కి గుర్తింపు ఉంది. కానీ టీచర్ ని నటులు రాజకీయ నేతలు మిగతా వృత్తుల వారు తప్పక గుర్తు పెట్టుకుని ఎక్కడ కనపడ్డా పలకరిస్తారు.గురుకుల పాఠశాలల్లో చదివిన వారు తమతో ఉండి ఒక లోకో పేరెంట్ గా మంచిచెడ్డలు కనుక్కునే తమ అధ్యాపకులను జీవితాంతం మర్చిపోరు.కాబట్టి నేను టీచర్ ని అయి సంఘసేవ బీద బస్తీ పిల్లల కి చదువు ఫ్రీగా చెప్తాను." శభాష్ అంటూ అంతా చప్పట్లు కొట్టారు 🌺
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం