సంక్రాంతి లక్ష్మికి స్వాగతం ;-చంద్రకళ. యలమర్తి
బీడువారిన నేలలన్నీ
పచ్చనీ చేలుగా మారెచూడు 
బంగారు పంటలే పండినాయి 
పల్లెసీమలు కళ కళ లాడె చూడు 

రైతన్నల చెమటచుక్కలు 
స్వాతి చినుకులై కురిసినాయి
పుడమి సంద్రమై ముత్యాల  ధాన్యపు సిరులనే ఇచ్చెచూడు 

సస్యలక్ష్మి కరుణ తోటి
కలలు పండగ పండె పంటలు 
ధాన్యమంతా ఇల్లుచేరెను
ఇళ్ళలోని గాదెలన్నీ నిండె చూడు

నట్టింట బొమ్మల కొలువులు
ముంగిళ్ళలో ముత్యాల ముగ్గులు
హరిదాసుపాటలు,గంగిరెద్దుఆట లు 
పల్లెలన్నీ స్వర్గసీమలాయెచూడు 


 కొత్తఅల్లుళ్ళ కోరికలతో 
కొంటె మరదళ్ళు అల్లర్లతో 
పిండివంటలఘుమఘుమలు   పట్టుబట్టల రెపరెపలు చూడు

కోడి పందేలాతో పెద్దలు 
భోగిపళ్ళతో చిన్నారుల ముచ్చట్లు 
ఆకశాన పక్షుల్లాఎగిరే గాలిపటాలు 
సంక్రాంతి పండగ సందళ్ళు చూడు

*-***


కామెంట్‌లు