శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 వైష్ణవ అంటే విష్ణు ఉపాసకులు అని అర్థం.పద్మపురాణంలో ఇలా ఉంది "విష్ణు దేవా అస్యవిష్ణు అణ్ విష్ణు యజతేవా.రుగ్వేదంలో ప్రథమంగా విష్ణు నామం కన్పడ్తుంది.శంకరాచార్యులవారికాలంలో భక్త భాగవత వైష్ణవ పాంచరాత్ర వైఖానస నిష్కామ అనే ఆరు రకాల సాంప్రదాయాలుండేవి.విష్ఢువు కృష్ణుని ఉపాసించేవారు.మహాభారతకాలంలోనారాయణీధర్మం అనేవారు.కృష్ణ ఆరాధనతో భాగవత ధర్మం ఊపందుకుంది.ప్రకాశ ఆనందస్వరూప చైతన్య సాంప్రదాయాలు ముఖ్యమైనవి.బలి విభీషణ భీష్మ ప్రహ్లాద నారద ధ్రువులను ప్రాతఃస్మరణీయులుగా తలుస్తారు.
వైశ్య అంటే వ్యాపారి వర్తకం చేసేవారు.విశ్ అనే ధాతువు నుండి వచ్చింది.దీని అర్థం ప్రజలు అని.వైశ్యులు పంటలు పండించే వారు ప్రాచీన కాలంలో! ధర్మ శాస్త్రము లో వైశ్యుల ధర్మం వ్యవసాయం పశుపాలన వాణిజ్యం అని చెప్పబడింది.వీరిలో ఎక్కువ మంది రైతులు.భూమిస్పృశ్ భూమి జీవి అని పిలిచేవారు.కాలాంతరంలోవాణిజ్యం వ్యాపారం ఇచ్చి పుచ్చుకోవడం వల్ల వైశ్యులనే పదం స్థిరపడింది.ఆర్ధికంగా బాగుండి ఉన్నత వర్గంలో చేర్చబడినారు.
కామెంట్‌లు