భగవంతుడు సృష్టించిన సకల జీవకోటి రాశుల్లో మానవ జన్మ మహోన్నతమైంది. ఎన్నో వేల జన్మలలో విశిష్టమైన పుణ్యం చేసుకుంటే గాని అతి దుర్లభమైన మానవ జన్మ లభించదన్నది శాస్త్ర వాక్యం. ఎంతోమంది మహాత్ములు నడయాడిన ఈ పుణ్యభారతావనిలో.. జన్మించడం మనం చేసుకొన్న గొప్ప భాగ్యం. అలాంటి మానవజన్మకు ఓ అర్థం పరమార్థం చేకూరాలంటే.. మన మహాత్ములు చూపిన మంచి మార్గాన పయనించాలి. మనం సృష్టించుకొన్న కుల మత వర్గ,ప్రాంతీయ వైషమ్యాలను విడనాడి మానవత్వంతో జీవించాలి.
మన పెద్దలు చెప్పినట్లు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్న నానుడిని సదా స్మరిస్తూ.. మంచి జీవితానికి నాంది పలికి నిరంతరం ఆ భగవంతుని సేవలో తరించి.. ఈ జన్మను ధన్యం చేసుకొనడంలో కృతకృత్యులవుదాము.
ప్రతి మనిషి జీవితంలో చదువు చాలా ముఖ్యమైనది. ఫలం, ఫలితం లేని చదువులు ఎంత చదివినా వ్యర్థం. ఎంత పెద్ద చదువులు చదివినా.. ఎంత ఉన్నత పదవులు అలంకరించినా.. సంస్కారముండాలి. సంస్కారం లేని చదువు ఎందుకూ కొరగాదు.
పూవుకు పరిమళం తోదవకపోతే అది గడ్డి పువ్వు గా మనం తీసిపడేస్తాం. ఏ సేవలో కూదా ఇటువంటి పువ్వులను వాడం. అట్లే గొప్ప చదువుకు సంస్కారం తోడైతే ఆ మనిషి జీవితం పరిపూర్ణం అవుతుంది. సంస్కారం లేని మనిషి జీవితం ప్రాణం లేని జీవం లాంటిది.అది ఎందుకూ పనికిరాదన్న విషయం అందరం అర్ధం చేసుకోవాలి.
తరాలు కూర్చొని తినే భోగభాగ్యాలు నీ వెంట రానే రావు. కేవలం మనం చేసే మంచి పనులు నిన్ను కీర్తిశిఖరాలకు చేరుస్తాయి.
ఈ పుణ్యభూమిలో ఎందరో మహానుభావులు ఈ జన్మభూమికై ఎన్నో త్యాగాలు చేసారు. వారు మన హృదయాల్లో అమరజీవులుగా చిరంజీవులై నిలిచిపోయారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి మనిషి మానవత్వం మరువరాదు.
నీతి నిజాయితీని వీడరాదు. మనకున్నంతలో ఆపన్నులకు, అన్నార్తులకు సాయం అందించాలి. అపుడే ఈ మానవ జీవితానికో అర్థం పరమార్థం. ఆ భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జీవితం ఆ భగవంతుని సేవకై అంకితమిద్దాం.
అహంకారమనే మాయా సంసారం దాటాలంటే సంస్కారం కావాలి. అది మనిషిని ప్రభావితం చేసినప్పుడు అహంకారం దూరం అవుతుంది.రెండు రూపాయల విలువ చేసే ఇనుముకు సంస్కరిస్తే వందల రూపాయల విలువ చేసే వస్తువుగా మారుతుంది. ఖర్చు లేకుండా పొందేది సంస్కారం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి