బ్రహ్మ, నారద సంవాదంలో.....
గణేశ, కార్తికేయుల బాలలీల - వివాహ విషయం పై వివాదం - భూప్రదక్షిణకు శివ ఆజ్ఞ - గణేశ అశక్తత - తల్లిదండ్రులకు ప్రదక్షిణ - అదియే పృథివీ ప్రదక్షిణగా శివుని ఒప్పుదల - గణేశుని వివాహం - కుమారస్వామి పృథివీ ప్రదక్షిణ పూర్తి చేసి వచ్చి క్రౌంచపర్వతమునకు వెళ్ళడం - కుమారఖండ శ్రవణ ఫలము.
*నారదా! "తాను, భూ ప్రదక్షిణ చేసానో లేదో మీరే నిర్ణయించండి" అని పలికిన గణేశుని మాటలు విన్న జగన్మాతా పితరులు పరమానందాన్ని అనుభవించి, తమ కుమారునితో, "నాయనా కుమారా! నీవు బుద్ధశాలివి. విపత్కరమైన సమస్యలు వచ్చినపుడు తెలివైన వారి, బుద్ధికుశలత తెలుస్తుంది. కఠిన సమస్యలను ఛేదించి, సాధించినప్పుడు, కార్యసాధకుని, సాధక లక్షణం బయటకు వస్తుంది. తనకు పరమాత్మ ఇచ్చిన ఆలోచనా శక్తిని, అవసరమైన సమయంలో, సరిగా వాడ గలిగిన వాడు, బుద్ధికుశలుడుగా చెప్ప బడతాడు. నీవు, వేద శాస్త్రములలో చెప్పబడి, ధర్మ బద్ధమైన పనే చేసావు. తల్లిదండ్రులను పూజించి, ఏడు మార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసిన వానికి, సప్త సముద్రాలు, సప్త ద్వీపాలతో కలసిన ఈ భూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. ఇది నిజము." ఈ విధంగా గణేశ భూ ప్రదక్షిణను ఒప్పుకున్న శివాశివులు, ప్రజాపతి విశ్వరూపుని పిలిపించి, "రాజా, నీ కుమార్తెలు సిద్ధి, బుద్ధి లు, దివ్యరూప సంపన్నులు, సర్వాంగ శోభితులు, సర్వసద్గుణ సమన్వితులు. వారిని, మా కుమారుడు గణేశునికి ఇచ్చి వివాహము జరిపించమని" కోరారు.*
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ" అని రోజూ తాను కొలుచుకునే వేలుపులే చెపితే, కాదనేది ఏముంది, కానిది ఏముంది. ఉమాశంకరుల తృప్తి మేరకు, సిద్ధి, బుద్ధి లతో గణేశుని వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు, ప్రజాపతి విశ్వరూపుడు. ఈ వివాహాన్ని సుసంపన్నం చేయడానికి సకల దేవతలు వచ్చారు. కొంత కాలం తరువాత, సిద్ధి, బుద్ధి ల ద్వారా గణేశునకు "క్షేముడు", " లాభుడు" అని పిలవబడే ఇద్దరు కుమారులు జన్మించారు.*
*ఇంతలో, కుమార షణ్ముఖుడు పృథివీ ప్రదక్షిణ పూర్తి చేసుకుని, తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నాడు. అక్కడ, గణపతి కనబడక, తానే ముందు వచ్చాను అనుకుని, తన వివాహం జరిపించమంటాడు, కార్తికేయుడు. తరువాత, విషయం తెలుసుకుని చాలా బాధను అనుభవిస్తాడు. క్రౌంచ పర్వతము వైపు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కార్తికేయునికి "కుమారత్వము" సిద్ధించింది. "కుమారస్వామి" గా ప్రసిద్ధి చెందిన నామము, శుభదాయకమూ, సకల పాపహరమూ, పుణ్యమయమూ అయి మహత్తరమగు బ్రహ్మచర్య శక్తిని ఇవ్వగలిగినది. కార్తీక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం లో కార్తికేయుని దర్శించిన వారి పాపాలు అన్ని తొలగి పోతాయి. పార్వతి కోరిక మీద తన అంశ అయిన మల్లికార్జున స్వామి గా, క్రౌంచ పర్వతం మీద కు వెళ్ళి, కుమారస్వామిని చూచారు, పరమేశ్వరుడు. మల్లికార్జునుడుగా జ్యోతిర్లింగంగా, శివా సహితుడిగా అక్కడ వెలిశాడు, శంభుడు. ప్రతీ మాసములో, అమావాస్య నాడు శంకరుడు, పౌర్ణమి తిథిలో, పార్వతి క్రౌంచ పర్వతము మీదకు వస్తారు.*
*నారదా! ముని పుంగవా! నీవడిగిన కుమార వృత్తాంతం అంతా సవివరంగా నీకు తెలిపాను. ఈ చరిత్రను, చదివినా, చదివించినా, వినినా, వినిపించినా, వారి కోరికలు తీరి, అన్ని పాపాల నుండి ముక్తి కలుగుతుంది. మోక్షప్రదమై, శివ సంబంధమైన జ్ఞానమును వృద్ది చేస్తుంది. శివాద్వైతజ్ఞానము కావాలి అనుకుని, ఎల్లప్పుడూ శివ భక్తుడు గా ఉండాలి అనుకునే వారు ఈ కథను నిరంతరంగా చదువుతూ ఉండాలి.*
*రుద్ర సంహిత లో, కుమార ఖండము సంపూర్ణము.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి