సిద్ధప్ప కవి(కంద పద్యాలు):- మమత ఐల-హైదరాబాద్ 9247593432

  క.
మట్టిని మైనము జేయను
దట్టముగా ద్రొక్కి దాని తగురీతిగనున్ 
గట్టిగకడవల జేయను
మట్టిన సిద్దప్ప మారె మానిక్యముగన్ 
క.
 సల్లను జేయగ ధరలో
కొల్లగనుపయోగమౌను కుండలు నెపుడున్ 
చల్లని సల్లను త్రాగిన
నుల్లాసమునిచ్చి మనసునూరట గొలుపున్ 
క.
వరకవి యాసిద్దప్పకు
వరముగ శివుడే నొసగెను పాండిత్యంబున్ 
గరలుని దీవెనె తోడను
వరకవి యాశువుగజెప్పె పద్యపు కృతులన్ 
క.
గుండారెడ్డీ పల్లెన
దండిగ కోహెడనసిద్దు ధగధగ మెరిసే
కుండలు జేసెడి సిద్ధుడు
దండిగ రచనలనుజేసె ధరణిన కవియై
  
కామెంట్‌లు