కందం:
*అవయవ హీనుని సౌంద*
*ర్యవిహీను, దరిద్రు, విద్యరాని యతని సం*
*స్తవనీయ, దేవు, శ్రుతులన్*
*భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !*
తా:
కుమారా! అంగవైకల్యము కలవారిని, అందముగా లేనివారిని, బీదవారిని, చదువులేని వారిని, గౌరవించవలసిన వారిని, భగవంతుడిని, వేదాలను, శ్రుతులను, తక్కవ చేసి మాట్లాడ కూడదు, నిందించ కూడదు అని ఈ భూమి మీద పండితులు,సద్భుద్ధి కలవారు చెపుతున్నారు........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఎవరెవరి కర్మ ఫలం వల్ల, ఎవరికి ఏమి, ఎంత, ఎప్పుడు రావాలో అపుడు వారి అంతంత పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇది సత్యం. ఇదే సత్యం. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని మనం నిర్ణయించ లేము. ఇది నిజమైనప్పుడు, ఎవిరనైనా తక్కువ చేసి, నిందిస్తూ మాట్లాడే అధికారం మనకెవరికీ లేదు. అందువల్ల, అందరినీ సమదృష్టితో చూసే మంచి మనసు మనకు ఇవ్వమని ...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి