ఎంతైనా : - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
మొక్కల వల్లనే మనం బ్రతుకుతున్నాం తప్ప 
మహా వృక్షాల వల్ల కాదు.!?

పంటల వల్లనే 
మన కడుపు నిండుతుంది తప్ప 
మహా రణ్యాల వల్ల కాదు.!!?

మనిషి 
ఎంతైనా తాగేది నీటిని కానీ 
రక్తాన్ని కాదు. 

మృగం 
ఎంతైనా తాగేది రక్తాన్ని కానీ 
నీటిని కాదు. 

మొక్కలు 
ఎంతైనా పీల్చేది 
కార్బన్ డయాక్సైడ్ కాని 
ఇచ్చేది ఆక్సిజన్ నే!!?

మనిషి 
ఎంతైనా వీల్చేది 
ఆక్సిజన్ నే కానీ 
ఇచ్చేది కార్బన్డయాక్సైడ్నే.

ఎంతైనా కరిగి తరగనదీ
హిమాలయమే 
ఎంతైనా పెరిగి తరగనదీ
సముద్రమే.!!?
ఎంత వాడినా తరగని సారం 
భూమిదే.!!?
ఎంత వెలిగిన మిగిలి ఉన్నది 
సూర్యుడే...!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.

కామెంట్‌లు