గీతా తత్త్వం (14); - డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ నిర్వచనాన్ని బట్టి ప్రపంచము యొక్క మూల తత్వము ఇలాంటిది అని తెలుసుకున్న తెలివిని జ్ఞానం అని పిలుస్తారని  ప్రపంచ కార్యకలాపాలలో  పాల్గొంటూ దాని ద్వారా పొందే అనుభూతిని విజ్ఞానం అని పిలుస్తారని నిర్వచించారు  కానీ ఈ నిర్ణయాన్ని వేదాంతులు అంగీకరింపరు.  వారు ఏమని వాదిస్తారు అంటే దేహము నిలుచుటకు భౌతిక సంపత్తి యొక్క అవసరం ఉన్నప్పటికీ నిజమైన వేదాంతి దానికోసం ప్రయత్నింపదు  ఎందుచేతనంటే ఈ నశించే దేహాల వల్ల రక్షణకై వివేకి అయిన వాడు ఎవడు తన కాలాన్ని వ్యర్థం చేయదు  జ్ఞానం ఒకటి మాత్రమే  భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను బట్టి  జ్ఞానాన్ని సంపాదించడం కోసమే వేదాంతి తన కాలం అంతా వినియోగిస్తారు  అని వారు వాదిస్తూ ఉంటారు.
కానీ నీ వాదాన్ని పామరుడు సైతము అంగీకరించడు కారణమేమిటంటే  పనికి సోమరిపోతుల ప్రవర్తించేవాడు ప్రపంచానికి దొంగ అన్న సామెతను అనుసరించి  పనికి దూరంగా ఉండేవాడు ప్రజ్ఞా హీనుడే అని చెప్పవలసి వస్తుంది కదా ఒకవేళ ప్రపంచ వ్యవహారాలను వదిలివైసి ఏకాంత జీవితాన్ని గడిపే జ్ఞాని అని వేదాంతి వాదిస్తే  వ్యవహార బాధ్యతలను ఉద్యోగుల పరము చేసి ఉద్యానవనముల మధ్య గాలి కొరకై కట్టించుకున్న విశ్రాంతి మందిరాలలో ఏకాంత వాసము చేసే సోమరులు సైతం జ్ఞానులని నిర్ణయించవలసి వస్తుంది కదా  ఇంతకు నువ్వు కార్యకలాపాలు బంధ కారణాలు కావు అని  తెలుసుకున్న వేదాంతి కూడా  లోక వ్యవహారాలకు భయపడి సమాజానికి దూరంగా తొలగిపోయినట్లయితే  ఇక సామాన్యుల గతి ఏమిటి అని మా ప్రశ్న  మా వాదం ఏమిటంటే. వ్యవహారరిత్య కృంగి కృసించిపోతున్న సామాన్య ప్రయాణి గారికి ధైర్యాన్ని కలిగించడం కోసం  సుఖ దుఃఖాలకు కారణము మనసే కానీ ఎందుకు పనికిరాని జడములైన  కార్యకలాపాలు కావు అని  ప్రబోధాలు చేయడం వారితో పాటు తాము కూడా కార్యరంగంలో ప్రవేశించడమే  దాని యొక్క ప్రధాన కర్తవ్యం అని మా అభిప్రాయం. మరి ఈ విషయంలో గీతాకారుడు ఏం చెప్తున్నాడో చూద్దాం  నాకు ముల్లోకములలో దేనిని కానీ పొందవలసినది లేకున్నను నిరంతరము కర్మలలో పాల్గొంటూనే ఉన్నాను. నేను ఏ కర్మలలో పాల్గొనకపోయినా  గౌరవనీయులైన శ్రేష్ట పురుషులు పనిచేయరాదనే భావము సమాజంలో స్థిరపడి  అందరూ పనులను మానివేసే ప్రమాదం ఉంది  అని గీతాకారుడు అంత స్పష్టంగా నిరూపిస్తూ ఉంటే  జ్ఞానులైన వారు కర్మలలో పాల్గొన రాదు అని వాదించడమే కాకుండా  తాము సుఖ జీవనం చేయడం కోసం ఎవరు కర్తలో అట్టి గృహస్తులనే అజ్ఞానులనుట కంటే దారుణమైన నిర్ణయం మరొకటి ఉండబోదు అని మా అభిప్రాయం.


కామెంట్‌లు