ఉత్తమ రైతు - శ్రీ కోటిరెడ్డి (2) - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఉత్తమ రైతు అంటే  వ్యవసాయం చేస్తున్న వారే కాకుండా ఆ క్షణం వరకు వ్యవసాయం అంటే ఏమిటో తెలియకుండా  వ్యవసాయ రంగాన్ని గురించి అధ్యయనం చేసి  వారు అప్పటికీ ఏ పంటలు పండిస్తున్నారు  దిగుబడి ఎంత వస్తుంది  ఆ వ్యవసాయం చేయటంలో పద్ధతులను మార్చినట్లయితే  ఎలాంటి దిగుబడి పొందటానికి అవకాశం ఉంటుంది  అన్న విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసి  విద్యావంతులైన కొంతమంది  ముందుకు వచ్చి  ఆ రంగంలో నిలిచినట్లయితే  రైతు జీవితం బాగుపడుతుంది  అన్న ఆలోచనకు  వచ్చి మాటలలో కాదు చేతలలో చూపిన వ్యక్తి  నెల్లూరు జిల్లాకు ఉత్తమ  రైతుగా ఎన్నుకోబడి  రాజశేఖర్ రెడ్డి గారి  అభిమానాన్ని పొందిన  ఉత్తమ రైతు. రాజశేఖర్ రెడ్డి గారు  ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు  టీవీ ద్వారా  ఆ నిర్వాహకులు ఒక కార్యక్రమాన్ని  సమర్పించినప్పుడు  అన్ని పార్టీల  నాయకులలో ఉన్న ముఖ్యులను పిలిచి  వారితో పాటుగా  నెల్లూరు ఉత్తమ రైతును కూడా పిలిచి  కార్యక్రమం నిర్వహించారు. ఎవరు మాట్లాడినా  వారి పార్టీ గురించి వారి సిద్ధాంతాల గురించి తప్ప  రైతును గురించిన విషయాన్ని మాట్లాడిన వాడు ఎవరూ లేరు. వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వారిని ఈ కార్యక్రమంలో  పిలిచి  శ్రోతల సమయాన్ని  తినేస్తున్నాం తప్ప విషయాన్ని గురించి మాట్లాడడం లేదు అని విసుగువచ్చిన ముఖ్య మంత్రి రెడ్డీ నెల్లూరు జిల్లాలో నీకు సంబంధించి నీకు తెలిసిన  వివరాలను తెలియజేయి  అప్పటికైనా ఈ నాయకులకు  విషయం అర్థం అవుతుందేమో చూద్దాం  అని చెప్పిన తరువాత  రెడ్డిగారు లేచి నిలబడి  సభకు ధన్యవాదాలు చెబుతూ  ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న  రాజశేఖర్ రెడ్డి గారు  వ్యవసాయదారుల గురించి  శ్రద్ధ తీసుకొని  వారి జీవన విధానాన్ని మార్చే ప్రయత్నాల్లో  ఎన్నో విధాలుగా సహకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకు ముందుగా వారిని అభినందిస్తూ... రెడ్డిగారూ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో  వి ఎల్ డబ్ల్యు  (విలేజ్ లెవెల్  వర్కర్) అన్న పేరుతో  కొన్ని వందల మంది ఉద్యోగులను  మీరు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నారు  కానీ వారి వల్ల రైతుకు ఏవైనా  ప్రయోజనం ఉన్నదా అని ఒక్క క్షణమైనా ఆలోచించారా  ప్రభుత్వ ఖజానా నుంచి జీతాల రూపంలో వారికి డబ్బులు ఖర్చు చేయడం తప్ప రైతులకు ఒరిగినది ఏమీ లేదు  దయచేసి వారి ఉద్యోగాలు తీసివేయండి అని సభా ముఖంగా  వేడుకుంటున్నాను అనగానే రాజశేఖర్ రెడ్డి గారికి  ఏమి తోచలేదు.



కామెంట్‌లు