ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (23);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఏ మంచి కార్యం జరగాలన్నా ముందుండి నడిపించగల సమర్థుడు  ఆయనతో మాట్లాడుతూ ఉంటే అనేక విషయాలతో పాటు నెల్లూరు ప్రాంతీయ భాష కూడా  మనకు అలవాటు అవుతుంది  అలాంటి ఓబుల్ రెడ్డి గారు అనేక సభలలో వ్యవసాయదారుడిగా తన అనుభవాలతో సూచనలు కూడా చేసేవాడు  కొన్ని సందర్భాలలో  నన్ను ప్రధాన వక్తగా ఆయన ఎన్నుకొని  ఆకాశవాణి కేంద్రం వారు వ్యవసాయం గురించి  ఎలాంటి సహాయం చేస్తున్నారు  తెలియజేయమని అడిగేవారు  ఆకాశవాణిలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం  మూడు పూటలా పొలం పనులు ఎలా చేయాలో  ఉదయం పూట చెపుతూ ఆ పనులలో ఎలాంటి కష్టాలు, నష్టాలు ఉంటాయో తెలియజేస్తూ మధ్యాహ్నం  కుటుంబ సభ్యులంతా కలిసి  వ్యవసాయం చేస్తున్నప్పుడు వచ్చే లాభాలు కౌలికిచ్చినప్పుడు  పొలానికి జరిగే నష్టాలు  వివరంగా తెలియజేయడం  ఆకాశవాణి లక్ష్యం. మొదట వ్యవసాయ కార్యక్రమానికి సంబంధించిన నిర్వహణను  బ్రాహ్మణులు  చేసేవారు. వారికి పుస్తక పరిచయం తప్ప పొలం వెళ్లిన పాపాన కూడా వాళ్ళు పోలేదు.  పొలాలు ఎలా ఉంటాయో కూడా తెలియని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. దానితో అనేక మంది రైతులు  ఆకాశవాణి సంచాలకులను కలిసి అతను అలా చెప్పడం వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి అండి  ఏది ఎంతవరకు జరగాలో ఏ పొలంలో  ఎరువులను కానీ రసాయన పదార్థాలను కానీ ఎంపిక చేయాలో అతని కన్న మా రైతులకే ఎక్కువ తెలుసు  అలాంటి వారు చెప్పడం వల్ల  కొంతమంది రైతులు  చెడు మార్గంలో వెళ్లి పంటలను నాశనం చేసుకునే దుస్థితి ఏర్పడుతుంది  అని ఎంతో వివరంగా చెప్పారు.
అప్పుడు ఆకాశవాణి సంచాలకులు  ఎంతో ఉదార స్వభావంతో  మా అందరినీ కూర్చోబెట్టి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది  రైతులకు  మంచి చేయలేనప్పుడు ఆ కార్యక్రమాన్ని మూసివేద్దామా  అన్న విషయాలన్నిటినీ కూలంకషంగా  చర్చించి  పుస్తక పరిజ్ఞానం కలిగిన వారు కాకుండా  పొలం వెళ్లి అక్కడ విషయాలు స్పష్టంగా తెలిసిన వారిని మాత్రమే చేస్తే బాగుంటుంది అన్న నిర్ణయానికి వచ్చి ఆ రోజే పత్రిక ప్రకటన చేయడంతో  కె వి సుబ్బారావు గారని రైతు తాను అగ్రికల్చర్ బి.ఎస్.సి  చేసి వ్యవసాయం చేస్తున్న  వ్యక్తి  వారు ఇంటర్వ్యూకు  వచ్చినప్పుడు  రెండవ ఆలోచన లేకుండా ఆయనను ఎన్నిక చేశారు  దానితో ఆ కార్యక్రమాలలో ఎన్నో చేర్పులు మార్పులు చేసి  సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నారు.

కామెంట్‌లు