ఉత్తమ రైతు - శ్రీ కోటిరెడ్డి (26)- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 25 సంవత్సరాల క్రితం మీకు తెలిసిన నిరంజన్ రెడ్డి గారు  కోటి రెడ్డితో స్నేహం మొదలుపెట్టారు  కొన్ని రోజులయిన తర్వాత రైతుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్న కోటిరెడ్డి ని దృష్టిలో పెట్టుకొని  రైతుల కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది  ఏం చేయాలో ఎలా చేయాలో ప్రణాళిక మాత్రం నా దగ్గర లేదు  దానికి మీ సహకారం  ఉంటే నేను కార్య రూపంలోకి దిగుతాను అని సూచనప్రాయంగా చెప్పాడు  దానికి కోటిరెడ్డి ప్రస్తుతం రైతులకు చెప్తున్న చాలా విషయాలను వారు మర్చిపోతున్నారు  దీనిని గ్రంధరూపంలో అందిస్తే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్న తర్వాత బాగా ఆలోచించి  సింహపురి రైతు అనే పేరుతో  రైతులకు సంబంధించిన  మాస పత్రిక  నెల్లూరులో చేస్తున్నారు కనుక  నెల్లూరుకు ఉన్న వెనుకటి పేరు సింహపురిని  కలిపి సింహపురి రైతు అన్న పేరుతో  ప్రారంభించారు.
నిరంజన్ రెడ్డి గారు  సంపాదకుడిగా కోటి రెడ్డి గారు ఉపసంపాదకుడిగా  కార్యక్రమాన్ని  నడుపు  తున్నారు. నిర్విరామంగా రైతుల కోసం వస్తున్న  రామోజీరావు గారి పత్రిక తర్వాత ఇదేనేమో మనసు పెట్టి చేస్తున్న పద్ధతి రైతులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని అందంగా నడుపుతున్నారు  పదిమంది రైతులు తీరికగా ఉన్న సమయం చూసి వారిని సమావేశపరచి ఒక్కొక్క సభలో ఒక్కొక్క విషయాన్ని గురించి  చర్చా   కార్యక్రమాలను నిర్వహించడం  దానిలో రైతులు చెప్పిన  ప్రశ్నలకు సమాధానాలు  రైతు గురించిన కొత్త కొత్త సూచనలు  చేర్చి వచ్చిన రైతులకు అర్థమయ్యే రీతిలో అది   ఉండేలా జాగ్రత్తగా  నడుపుతూ పత్రికను ముందుకు తీసుకు వెళుతున్నారు  అలా మిగిలిన రైతులకు కూడా  ఈ సింహపురి రైతు పత్రిక దగ్గరయింది. ఒక్కొక్క సభలో అనుభవమున్న ఒక్కొక్కరిని పిలిచి వారి చేత కూడా వ్యవసాయక విషయాలను గురించి చెప్పించి రైతుల అనుమానాలను తీర్చే విధంగా సభలు ఏర్పాటు చేశారు. ఇది ఎంతో శ్రమతో సహనంతో చేయవలసిన పని  దానిలో వీరిద్దరూ కృతకృత్యులయ్యారు అని చెప్పవచ్చు. నెల్లూరు ఆ పరిసర ప్రాంతాలలో జరిగే కార్యక్రమాలకు  బెజవాడ ఓబుల్ రెడ్డి గారు వచ్చేవారు  అధ్యక్షునిగా కూడా ఆయనే వ్యవహరించేవారు వారు బెజవాడ గోపాల్ రెడ్డి గారి కుటుంబీకులు వ్యక్తిగతంగా నేను వారి ఇంటికి వెళ్లి వారి ఇంటి పేరు బెజవాడ అని రావడానికి కారణం  రాజకీయాలలో వారి పాత్ర గురించి వివరంగా తెలుసుకున్నాను. నిరాడంబరుడు ఇతరులకు సహకరించడంలో ఆయనది  అందెవేసిన చెయ్యి.


కామెంట్‌లు