మన గురువు ప్రకృతి (3);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నేటి విద్యార్థులలో ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పి వెళ్లినట్లుగా కాకుండా గురు కులాలలో గురువుగారు  ఉదయం లేచిన నుంచి  రాత్రి పడుకునే అంతవరకు  జీవన విధానాన్ని తెలియజేయడానికి  ఉపన్యాసాల ద్వారా కాకుండా తాను ఆచరిస్తూ శిష్యులందరూ నిశితంగా పరిశీలిస్తున్న  సందర్భాన్ని సృష్టించి  దానినిపాఠంగా చెబుతారు  ఈ ప్రకృతిలో చెట్లు ఉన్నాయి  దాని వలన మనం నేర్చుకునేది ఏమిటి అని ఆలోచించినప్పుడు  మన జీవితానికి కావలసిన ఆక్సిజన్ ను  మనకు అందిస్తూ  మనం విడిచిన కార్బన్ డయాక్సైడ్   అది స్వీకరిస్తుంది  అంటే అది  నీ దగ్గర ఏదైనా మంచి ఉన్నట్లయితే దానిని అందరికీ సమంగా పంచు  ప్రత్యక్షంగా నీకేవరైనా చెడు చేసిన విరోధిని  క్షమించు అని చెప్పకనే చెప్తోంది  కానీ మనం గమనించం. సామాన్యంగా మానవుడు సోమరిపోతు  ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో  తెల్లవారి సామాన్య లేవాలి అన్న విషయాన్ని మర్చిపోయి గాధ నిద్రలో ఉన్న సమయంలో  కోడి కూత మనకు వినిపిస్తోంది  మనం అలారం ఎన్ని గంటలకు పెడితే అన్ని గంటలకు ఎలా మోగుతుందో అలా కోడి నిత్యం ఒకే సమయానికి లేచి  మనలను కూడా లేపుతుంది  కానీ మనం కోడిని చూడగానే అది గుడ్డు పెడుతుంది దాంతో ఆమ్లెట్ వేసుకోవచ్చు కొంచెం పెరిగిన తర్వాత దాని కోసుకొని ఆహారంగా తీసుకోవచ్చు మాత్రమే ఆలోచిస్తాం. ఆ రోజులలో ప్రయాణ సాధనాలు లేవు  ఎక్కడికి వెళ్ళాలన్న నడకనే వెళ్లి రావడం జరుగుతూ ఉండేది. కానీ ప్రకృతి ప్రసాదించిన  జంతువులలో గుర్రం ఆ ఇబ్బంది లేకుండా చేస్తుంది  క్షణాలలో మనం చేరవలసిన స్థలానికి తీసుకొని వెళ్లి  తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే వేగంతో వచ్చేస్తుంది.
ఇంట్లో గాని బయటికి గాని ఎవరైనా  ఏ విషయమైనా చెప్పతూ ఉంటే  అది తనను గురించి ఇతరులను గురించో తెలియదు  దానిని పట్టించుకోడు  అది పూర్తిగా వింటే కదా అతనికి విషయం అర్థం అవుతోంది  దానిని గుర్తు చేయడం కోసం  నిశితంగా పరిశీలిస్తూ  ప్రతి అక్షరాన్ని వినే మార్జాలాన్ని  అంటే పిల్లిని మనకు ప్రసాదించేది ప్రకృతి సామాన్యంగా ఏ మనిషికైనా ఎలా ఉంటుందంటే  మనం బజారులో వెళ్తునప్పుడు కానీ  మరో చోట గాని  ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు  తెలిసినవారు ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తారు. ఆ తర్వాత దానిని మనం మర్చిపోతా  ఒక్క ముద్ద అన్నం పెడితే కుక్క జీవితాంతం విశ్వాసాన్ని చూపుతుంది మన పట్ల  దానిలా ఎందుకు  ఉండలేవు  మంచిని చేసిన వాడిని ఎలా మర్చిపోగలవు అని ప్రశ్నిస్తుంది ప్రకృతి.


కామెంట్‌లు