నటనకు వ్యాకరణం బందా గారు (44);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 కళాకారుడు అన్న వాడికి శరీర వ్యాయామం ముఖ్యం. శరీరం తన అధీనంలో వుంటేనే నటన సక్రమంగా వుఅదే మన శ్రీధర్ ఉన్నాడు  ఊబకాయం పెంచాడు  
దాంతో కంఠంలో ధ్వని కూడా మారుతుంది కదా  వేదిక పైన భీముడుగా బాగానే రాణిస్తాడు  కానీ ఇక్కడ రేడియోలో వేషం అతనికి ఇస్తే  ఆ మాటలో భేదం తెలుస్తుంది. ఏదైనా  చిన్న పని చెప్పినప్పుడు నీవు పరుగున వెళ్లి ఆ పని చేసి రాగలవు కానీ సుబ్బన్నకి చెప్తే నీవు చేసిన అంత త్వరగా చేయగలడా  వయస్సు భేదం కనిపిస్తోంది కదా  అలాగే నటన కూడా. ఏ వయసుకు తగిన  కంఠం ఆ వయసుకు సరిపడినట్లుగా ఉండాలి.  వయసు ముదిరిన వాడిని తీసుకొని వచ్చి అతనికి తగిన వేషం ఇస్తే బాగుంటుంది కానీ  కథానాయకునిగా చేయిస్తే ఆ నాటకమే దెబ్బతింటుంది. ఇలాంటి నిజాలను చాలానే మాకు చెప్తూ ఉండేవారు. విమర్శించవలసినా నిర్మొహమాటంగా తార్కికంగా  సున్నితంగా పదాలను ఉపయోగించి మాట్లాడగలరు. అందుకే బందా కనక లింగేశ్వర రావు గారు మాకు ఎప్పటికీ ఆదర్శమే. నాటక రంగానికి 
దిక్సూచి. అందరికీ చిరస్మరణీయుడు.



కామెంట్‌లు