,కళాతపస్వి కాశీనాథునివిశ్వనాథ్ గారికి అశ్రునివాళి-పద్యాంజలి"!!!;- "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్- చరవాణి:- 6300474467
 01.
తే.గీ.
ఆ"కళాతపస్వి"యునేడునవనివిడిచి
స్వర్గధామమ్ముజేరియు,చలనచిత్ర
సీమలోటునుకలిగించిచింతనింపె
"వారికందింతునశ్రునివాళినిపుడు"!!!

02.
తే.గీ.
కళలనైపుణ్యమెఱిగినక్రాంతదర్శి
సాహితీరంగవైదుష్యచక్రవర్తి
సాంప్రదాయపువిలువలుశక్తితోడ
"చిత్రములయందునింపినస్నేహశీలి"!!!

03.
తే.గీ.
పలుకుటుంబపుసినిమాలుప్రతిభతోడ
తీసిప్రేక్షకమదిలోనతిష్టవేసి
కూరుచుండినసుమనస్వి;దారిజూపి
"దర్శకులకతండునుమార్గదర్శియయ్యె"!!!

04.
తే.గీ.
మాటతీరులోసంస్కృతిమధువులొల్కు
భారతీయతకనిపించువైభవముగ
మమతలాప్యాయతలనెన్నొసమముగాను
"పంచిపెట్టినమృదుశీ‌లిప్రథితయశుడు"!!!

05.
తే.గీ.
నవరసాలనుపండించినవ్యమైన  
శుభ్రసంగీతబాణీలనభ్రముగను
పాటలందునపలికించిమీటిమనసు
"తరతరాలకుస్ఫూర్తినివరముగనిడె"!!!కామెంట్‌లు