గీతా తత్త్వం (7); - డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నేను ఏదైతే మంచి చేయాలని అనుకుంటున్నానో  దానిని చేయలేకపోతున్నాను నా బుద్ధి చెప్పినది మనసు ఆచరించడం లేదు  దీనికి నన్ను ఏం చేయమంటావు అన్నది ధృతరాష్ట్రుని ప్రశ్న? రాజనీతి తెలిసిన నేను దేశ ప్రజల క్షేమాన్ని కాంక్షించి వారి సుఖం కోసం నేను చేసే ఏ పనీ కావడం లేదు నాకు ఏ రోజు రాత్రి నిద్ర పట్టడం లేదు  ఈ ఆలోచనలతో నా మనసు కకావికలమైపోతున్నది  నా ఆలోచనలలో తేడా ఉన్నదా  లేక ఆచరణలో ఏదైనా లోపం కనిపిస్తోందా?  ఎందుకు ఇలా జరుగుతోంది  నాకు అర్థం కాకుండా పోతుందని  దాదాపు కన్నీళ్లు పెట్టుకొని  తనకు అత్యంత ఆప్తుడైన  సంజయుని అడిగి  తెలుసుకోవడమే  ఈ గీతా సిద్ధాంతం, గీతా సందేశం.
ప్రపంచం మొత్తం ఎదురుగా ఉన్న అందరినీ జయించగలిగిన శక్తిసామర్థ్యం  కలిగిన అర్జునుడు ఎదురుగా తాను ఎవరితో యుద్ధము చేయవలసినదిగా వారిని గమనించి  నాకు హితాన్ని చెప్పినవారు  విద్యను నేర్పిన వారు  జీవిత పరమార్ధాన్ని అర్థమయ్యేలా చెప్పిన వారు ఎంతో మంది ఆత్మీయులు  రక్తం పంచుకు పుట్టిన  సోదరులు ఉన్నారు వీరందరిపై బాణాలు ఎక్కుపెట్టి వారిప్రాణాలను తీయలేను  నా ధనస్సు నా చేతి నుంచి జారిపోతుంది నేను  కూర్చోలేక పోతున్నాను శరీరం ఒణికి పోతుంది  ఈ యుద్ధాన్ని మానుకుందాం  నాకు రాజ్యం మీద  ఇష్టం లేదు  అని  చెప్పిన అర్జునునికి  ధైర్యాన్ని చేకూర్చడానికి  రాజ ధర్మాన్ని బోధించిన వాడు  శ్రీకృష్ణ పరమాత్మ  ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన ధర్మ జ్ఞానాన్ని ప్రపంచానికి  అందించినది భగవద్గీత.
ఎవరు నీ సన్నిహితులు బంధువులు అని నీవు  చింతిస్తున్నావో వారు కూడా  మిమ్మల్ని చేయించి వారి రాజ్యంలో కలపడం కోసం  ప్రాణాలకు తెగించి  మీ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు  నీవు వారిని చంపకపోయినా వారు నిన్ను చంపటం ఖాయం  అసలు యుద్ధం క్షాత్రధర్మం ఎదుటివారి యుద్ధానికి పిలిచినప్పుడు  వచ్చి తీరాలి జయాపజయాలు ఎవరి చేతిలోనూ లేవు  ప్రకృతి ఎవరికి అనుకూలంగా ఉంటే వారు జయిస్తారు  కానీ నీవు ఇలా అధైర్య పడి  నీ మనసును చంపుకున్నట్లయితే  నీలో సగం బలం పోయినట్లే లెక్క  కనుక ధైర్యాన్ని వహించు యుద్ధానికి సిద్ధంగా  ఉండు అనగానే  బావా కృష్ణా ముల్లోక ఆధిపత్యం కోసమైనా నేను ఎవరిని చంపను  ఇక ఈ భూమండలం విషయమై చెప్పనేల  వీరిలో ఎవరైనా  నన్ను చంపబోయినా నేను మాత్రము వారిని చంపనే చంపను ఇలా చంపడం వల్ల మనం పాపాన్ని మూట గట్టుకుంటాం తప్ప  విజయాన్ని కాదు  నిజానికి  మన బంధువులను హతమార్చినప్పుడు మనకు మిగిలేది దుఃఖమే తప్ప సుఖము కాదు అన్నాడు అర్జునుడు.



కామెంట్‌లు