పంట చేతికి వచ్చిన సమయంలో
పైరును కోసి కట్టలుగా కట్టి దానిని కుప్ప వేయడానికి ఆ కుటుంబం మొత్తం ఎంత శ్రమ పడుతుందో గట్టుమీద ఉండి యద్దేవా చేసే వాడికి తెలియదు పని వాళ్ళతో పని చేయిస్తూ తాను కూడా పని వాడిగానే ప్రవర్తిస్తూ ఆ కష్టాల్లో పాలు పంచుకోవడం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అది అనుభవించిన వాడికి తప్ప మరొకరికి తెలియదు కుప్పలు నూర్చేటప్పుడు కూలీలతో హాయిగా ఆనందంగా పాటలు పాడుకుంటూ శరీరానికి శ్రమ తెలియకుండా మధ్య మధ్యలో హాస్యోక్తులతో ఎంత ఆనందంగా గడుపుతారో తెలుసునా. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఆ రైతు కలిపి ముద్దలు పెడుతూ ఉంటాడు కుల మత విచక్షణ లేకుండా అందరూ ఆయన చుట్టూ కూర్చుంటారు వేళాకోళాలు ఆడుకుంటూ చేస్తున్న భోజనం ఆ విమర్శించేవాడు ఏ రోజునైనా అనుభవించాడా బయట ఉండి కబుర్లు చెప్పడం తప్ప.
ఆ పనిలో జొరబడాలి కూలీలలో ఒకరుగా ప్రవర్తించాలి అంతా ఒకే కుటుంబం అన్న భావం తప్ప మరొక ఆలోచన రాకుండా ప్రవర్తించాలి మంచు కురుస్తున్న కాలంలో ఆ గడ్డిలో పండుకొని నిద్రపోతున్నప్పుడు తన ఎదురుగా ప్రకృతి తప్ప మరొకటి కనిపించదు అంత చలిలోనూ దుప్పటి లేకపోయినా ఆ గడ్డి వల్ల వచ్చే వేడి ఎంత హాయిగా ఉంటుందో ఆ పగలంతా పడిన కష్టాన్ని ఈ నిద్ర మర్చిపోయేట్లుగా చేయగలదు స్త్రీలు ఇంటిదగ్గర వీరికి వంట చేసి పంపేటప్పుడు కూడా వారు కూలీలు అన్న భావంతో కాకుండా తన కుటుంబ సభ్యులు లాగానే భావించి వారందరికీ ఇష్టమైన పదార్థాలను భోజన సమయానికి ముందే ఏర్పాటు చేస్తారు అలా కుటుంబ సభ్యులందరూకలిసి ఒక కలిసి కట్టుగా పనిచేసి నీకు భోజనం పెడుతుంటే వారు అంత చులకనగా కనిపిస్తున్నారా? మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించండి. అతను తన కుటుంబ సభ్యులే అని మరిచిపోకండి అన్న నినాదంతో బయటకు వచ్చినవాడు రెడ్డి.
అంత చిన్న వయసులోనే ఇంత కష్టపడకుండా ఏదీ రాదు కదా అనే విషయాన్ని గురించి ఆలోచనా బీజం ఆ వయసులోనే పడింది అయితే వాటిని దృష్టిలో పెట్టుకుని విద్యను ప్రక్కన పెట్టలేదు పూర్తి సమయం దానికి కేటాయించి అవసరమైన సందర్భాలలో తానే వ్యవసాయ పనులకు పూనుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఏదైనా ఒక గొప్ప విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు సహజంగా ఆలోచనా పరులకు సొంతగానే పద్ధతులు తెలుస్తాయి వాటిని ఎలా ఆచరించాలి అన్న దాని గురించి వారు ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు ఆ కోవకు చెందిన వాడు కనుక జీవితంలో తన కర్తవ్యాన్ని మర్చిపోకుండా విద్య పూర్తి చేసిన తర్వాత వ్యవసాయ రంగంలో చేయవలసిన మార్పులను గురించి ఆలోచించడం ప్రారంభించాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి