గీతా తత్త్వం (8); -డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 శ్రీమద్భగవద్గీత  ఏ అమృత ఘడియలలో పుట్టినదో చెప్పలేము కానీ హిందూ సమాజంలో అసమానమై అజరామరమై మహోన్నతమైన  స్థిరస్థాయిని చెందినది. ఒకప్పుడు వేద సమ్మతము కాని మతమునకు అదెంతటి ప్రాముఖ్యతను చెందినది అయినను  హిందూ సమాజంలో దానికి స్థానము లేదు పట్టి మహోన్నతమైన వేదము యొక్క స్థానమును  తాను జన్మించిన మరుక్షణములోనే ఆక్రమించుకొని తనకు సమ్మతము కాని సిద్ధాంతమును అది ఎంతటి ప్రభావము కలిగి కానీ హిందూ సమాజ మంగికరింప చాలానంతటి పరమ ప్రమాణ గ్రంధముగా గీత స్థిరపడినది  అందుచేతనే జగద్గురు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి  వినోబాభాగే వరకు  హిందూ సమాజంలో జన్మించిన ఆధ్యాత్మిక రాజకీయవేత్తలు అందరూ తమ సిద్ధాంతములు  గీతా సమ్మకమైనవే అని తప్పనిసరి గా రుజువు చేసుకొనవలసి వచ్చినది. నిజమునకు శ్రీ శంకరాచార్యుల వారు అద్వైతి శ్రీ రామనుజుల వారు విశిష్టా ద్వైతి  శ్రీ మద్వాచార్యుల వారు ద్వైతి అంత మాత్రమే కాదు వారిలో మొదటి వారిది జ్ఞానమార్గము రెండవ వారి భక్తి మార్గము మూడో వారిది కర్మ మార్గము అదే విధముగా రాజకీయ నాయకులలో కూడా కావలసినన్ని భేదములు కలవు. ఉదాహరణకు ఆకతాయిలను చంపవచ్చుననునది తిలక్ మహాశయునివాదం  ఆకతాయిలను సైతం చంపరాదనియు ధనికుడు తమ ధనమును తామే ధర్మకర్తలుగా ఉండి త్యాగము చేయవలయునది  గాంధీ గారి వాదము  తనకు కావలసిన దానికంటే మించిన దానిని  సమాజమునకు ఇవ్వకపోవడం మహా పాపమనునది వినోబాభావే వాదము. అయినను ఇదంతా గీత తమ వాదమునే సమర్ధించుచున్నది  అని రుజువు చేసుకోవడానికి తలకొక భాష్యమును వ్రాయవలసి వచ్చినది  దీనిని బట్టి హిందూ సమాజంలో గల మత గ్రంథములలో గీతకు గల ప్రాముఖ్యత  స్పష్టపడుతోంది.కామెంట్‌లు