"హూరి...రోబో గర్ల్'; - చంద్రకళ యలమర్తి--8008915928--విజయవాడ
 "రఘూ,  పెళ్ళెప్పుడు చేసుకుంటా
వురా? నేనుఈచాకిరీలుఎన్నాళ్ళు
చెయ్యాలి రా? 32 ఏళ్ళు వచ్చినా  పెళ్ళి కాని కొడుకుని  తల్లి సీతమ్మ అడిగింది.
"నేనేదో వంకలు పెట్టి, పెళ్ళి సంబం
ధాలు తిరగకొట్టినట్టు అలా అంటా
వేమ్మా?  నీకే, యే అమ్మాయి నచ్చ
ట్లేదు."
"నేనెప్పుడు ఏం అన్నానురా?
"ఆ పెద్దాపురంఅమ్మాయిపల్లెటూరి
పిల్లలా మోటుగా వుంది అని వద్దన్నావు. రాజమండ్రి అమ్మాయి లావుగా వుంది. గుంటూరు అమ్మాయి పొగరుగా వుంది. బొంబాయి అమ్మాయికి తెలుగు రాదు. అమెరికా అమ్మాయి అయితే అసలు పద్ధతులే తెలియవు అని వచ్చిన అన్ని సంబంధాలు తిరక్కొట్టావు కదా."
 "బావుందిరా  అన్నివిధాలా మంచి సంబంధం తేవాలనే కదరా,
నేను మాత్రం ఏం పెద్ద కోరికలు కోరలేదుగా. ఏదో కాస్త పెద్దలంటే గౌరవంఇవ్వాలి.  కోటి రూపాయల కట్నం కావాలన్నాను. నీకోసమే కదా డబ్బులు నేనేం చేసుకుం
టాను. కాస్త తెల్లగా,అందంగా,
నాజూకుగా, వుండి అత్త,మామ
ల్ని చూసుకుంటూ ఉద్యోగంచేస్తూ, వంటకూడ వచ్చినమ్మాయి అయి
తే బాగుండు అన్నాను అంతేగా?"
" అంతేనా?ఇంకే మయినా మర్చి పోయావేమో చూడమ్మా?"
"అదేంటిరా? వెర్రినాగన్నా
ఆమాత్రం కోరుకోరుకుంటే  తప్పా ? "
"నువ్వు కోరుకోవే అమ్మా. తప్పేం లేదు.  కాని నాకు మాత్రం ఇంక 
 ఈ జన్మకి పెళ్ళి అవ్వదని బాగా అర్థమైపోయింది."
"అలా ఆపశకునం మాటలు మాట్లాడకురా అబ్బాయ్, నీకు పెళ్ళి కాకపొతే ఇంకెన్నాళ్ళు మేం చాకిరీలు చెయ్యాలిరా?  ఇంక 
ఈ వయసులో మమ్మల్ని కూర్చో
బెట్టి,, వండిపెట్టే కోడలు రావాలని కోరుకోకూడదా?"
"అంత ఆశలు పెట్టుకోకే అమ్మా, కూర్చోబెట్టి అన్నం పెట్టే రోజులు అయిపోయాయి. అసలు ఇంట్లో ఉండనిస్తే కద. అందుకే మనం ఇలాగే హాయిగా వుంటే పోలా?'
"ఆ! మరీ విడ్డురంగా చెబుతు
న్నావురా."
 "చివరి రోజుల్లో మమ్మల్ని ఎవరు చూస్తారు?"
"నేను వున్నాను కదా మిమ్మల్ని చూసుకుంటాను."
"ఇంటిపని, వంట పనినువ్వే ఏం చేస్తావురా"?
"ఈరోజుల్లో ఎవరూ, ఎవరినీ చూడరు తెలుసుకోవే.పని చేసు
కుంటుంటేనే ఓపిక వస్తుంది."
"మరీ, చేటు కాలం వచ్చిందిరా."
" పెద్ద చదువులు,లక్షల్లో జీతం,
కోట్లలో కట్నాలు కోరు కుంటూ వంట కూడా చెయ్యమంటే ఎలాగే పాపం."
"పోనిలేరా ఉద్యోగం చెయ్యని అమ్మాయిని చేసుకోరా."
రోజూ మీ ఇద్దరూ గొడవలు పడ
తారు. రాత్రికి నేను వచ్చితీర్పు చెప్పాలి. మీ ఇద్దరికీ వంట చేసి పెట్టాలి అంటే నా వల్లకాదమ్మా."
"ఏదో ఒక ఐడియా వేసి ఒక ఆడ పిల్లని ఇంటికి తీసుకురారా."
"పెళ్ళి చేసుకోడానికా?, నీ పనులు చెయ్యడానికా?"
"ఆన్నీ కలిసివస్తాయని పెళ్ళి చేసుకో మంటున్నాను."
"అమ్మా,మరయితే ఒక పని చేద్దాము.చైనాలో రోబో గర్ల్స్ ని తయారు చేసారుట. ఒకటి కొనుక్కుందాం మనకు వంట చేస్తుంది, ఎదురు చెప్పదు, నగలు, నాణ్యాలు, జీతాలు అడగదు. హక్కులు అని వాదించదు. మన పనిచేసాక స్విచ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది."
"అదేంటి మరీ మరబొమ్మను చేసుకుంటావా?"
"చూడ్డానికి అమ్మాయిలాగానే ఉంటుంది. ధర 2 లక్షలుట. మీరు 
ఉ... అంటే ఆర్డర్ ఇచ్చేద్దాం దాన్నే కోడలనుకోండి. ఇండియా కోసమే వాళ్ళు తయారు చేస్తున్నారట."
"ఇదెక్కడ చోద్యంరా?  పేపర్లో వార్తలు చదివి నిజంగా అలాంటివి వుంటాయి అనుకుంటున్నావా?"
"పేపర్లో వార్త కాదమ్మా, ఇదినిజమే మాఫ్రెండ్ వాళ్ళింట్లో నా కళ్ళారా చూసాను. వాడు కొన్నాళ్ళు   చైనా
లోపనిచేసాడు.ఇండియా కి తిరిగి వచ్చేస్తూ కొనుక్కొచ్చాడు. హురీ అని పిలవచ్చు."
"అదేం పేరు అబ్బాయ్? మరీనోరు తిరగట్లేదు. కొడుకు మాటలకి ఆవిడ కాళ్ళు, చేతులు ఆడక 
 కంగారు పడిపోసాగింది."
"వాళ్ళు తయారుచేసారు వాళ్ళి
ష్టం పోనీ,పోరీ అని పిలువు కాస్త ఇండియా పేరులా ఉంటుంది.
నా ఆఫీస్ టైం అయ్యింది వస్తాను. రాత్రిలోపు ఆలోచించి చెప్పండి."
**
"ఏంటీ  విశేషం? పూరీలు వండు
తున్నావు"  ఆనందం, ఆశ్చర్యం కలిసిన గొంతుతోఅప్పుడే వాకింగ్  నుండి వచ్చిన రామయ్య వంటిం
ట్లోకి వస్తూ వీళ్ళ మాటలు విని అడిగాడు.
"మీకెప్పుడూ ఆ తిండి గోలేనా?కొడుక్కి పెళ్ళి చెయ్యాలానే ఆలోచన వుందా?"
"నీకు డబ్బులు, నగలు,నాణ్యాలు కావాలి అవి నేనేం చేసుకుంటా?"
"బాగుంది సంబండం, కొడుక్కి పెళ్లికాలేదని చెయ్యాలని ఆలోచన వుందా?"
"మా ఫ్రెండ్ కూతురు వుందికదా.
బుద్ధిమంతురాలు, పని మంతు
రాలు, మనకి తెలిసిన పిల్ల, మన
మంటే ప్రాణం ఇస్తుంది. నువ్వే కట్నం ఇవ్వలేరు వద్దన్నావు."
"సరే అప్పుడేదో అలా అనుకున్నా.
రేపు వెళ్ళిఆ సంబంధం కుదుర్చు
కుని వద్దాము."
 ఊఁ...త్వరగా వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పండి."
"ఏమయ్యిందే? ఇంత హటాత్తుగా మనసు మార్చేసుకున్నావు.ఈ
రోజు సూర్యుడెటు పొడిచాడే?"
"అవతల మీ కొడుకు చైనా హురీ ని కొని పెళ్ళి చేసుకుంటాడుట."
చైనీస్ అమ్మాయా? వీళ్ళఆఫీసు
లో చేస్తుందా? మనమే కట్నం ఇవ్వాలా? ఆ చైనా పిల్ల నిన్ను చింగ్ అని, నన్ను చాంగ్ అని పిలుస్తుందేమో. మనం నూడుల్స్ కొనుక్కోనక్కరలేదు. తనే చేసే
స్తుందేమో."
"మీ సంబండం కాకులెత్తు కెళ్ళ హురీ అంటే ఆడపిల్ల కాదు."
"ఖర్మ, ఖర్మ మరి మగపిల్లాడా?"
"మీ హాస్యానికేం గాని త్వరగాఫోన్ చెయ్యండి. అవతల వాడు రోబోని  పెళ్ళి చేసుకుంటా

అంటున్నాడు."
"అయ్యో, అదేం చిత్రమే ఇప్పుడే మాఫ్రెండ్ తో మాట్లాడుతాను."
"ఊ... కానివ్వండిత్వరగామాట్లాడి దగ్గర ముహూర్తం పెట్టించండి.ఏ గుళ్ళోనో మూడు ముళ్ళు వేయిం
చేద్దాము."
"అయితే సరే ఇప్పుడే చేసేస్తున్నా. నువ్వు  కూడా సిద్ధంగా వుండు
మరి."
"శుభం."
**

కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం