నేడు ఆడపిల్లలకి స్వేచ్ఛ కాస్త ఎక్కువ ఐంది.గొప్పింటి బిడ్డలు ఏకాస్త చిన్న ఫంక్షన్ ఐనా పబ్ బార్ కి వెళ్లటం మామూలైపోయింది.ఇక మధ్య తరగతి బాలికల అమ్మ నాన్న ఇద్దరు జాబ్స్ కి వెళ్లడంతో పట్టించుకునే నాథుడే లేడు.ఇంట్లోకి రాగానే కీతో తలుపులు తెరుచుకుని వచ్చిన అమ్మాయి ఏదో స్నాక్స్ తిని పొరుగింటి ఆంటీ ఇంటికి ట్యూషన్ అని పోతుంది.ఆంటీ లేకుంటే అక్కడ ఉన్న పిల్లల తో సరదాగా మాట్లాడుతుంది.ఇక అలా పరిచయం బైట చాటుమాటుగా వేరే అబ్బాయితో తిరిగేదాకా వస్తుంది.8వక్లాస్ పిల్ల తమ్ముడి సార్ ఇంటికి లెక్కల ట్యూషన్ కి వెళ్లేది.తల్లి టి.వి.షాపింగ్ తో వెళ్లి ఏమీ పట్టించుకునేది కాదు.ఓరోజు 9ఐనా రాకపోతే కొడుకుని తరిమిన తల్లి అతను చెప్పిన విషయాలు విని తెల్ల బోయింది."అమ్మా! అక్కయ్య ఇంకో అక్క కలిసి సార్ తో ఎక్కడికో వెళ్ళారుట". రాత్రి 11దాటాక తూలుతూ వచ్చిన కూతురు నుంచి చూసి లబలబలాడింది.ఆమె భర్త టూర్ వెళ్లాడు.
ఇంకో రకం అమ్మలు చాలా పొట్టి ఫిట్ డ్రెస్ వేసి 10ఏళ్ళ కూతురు ని ట్యూషన్ కి పంపుతుంది.ఆటీచర్ మొత్తుకుంది"అమ్మా! కాస్త లూజ్ డ్రెస్ పొడుగువి వేయండి"అని.కానీ టీచర్ మాటలు పట్టించుకోదు ఆతల్లి.ఇలాంటి అమ్మలను ఒక టీచర్ గా నేను రోజూ చూస్తుంటాను.ఒకరోజు రోడ్డుపై ఆపిల్ల వెంట ఇద్దరు 20ఏళ్ళలోపు అబ్బాయిలు పాటలు పాడుతూ అడ్డదిడ్డంగా సైకిల్ తొక్కడం చూసి కూడా రోడ్డుపై వెళ్లేవారు అసలు పట్టించుకోవడం లేదు.నేను గబగబా ఆపిల్ల దగ్గరకు వెళ్ళి "మీ చెల్లిని ఇలా ఏడిపించకూడదు"అని అంటే "టీచర్!ఆమె బాడీ గార్డులం" అంటే అవాక్కు అయ్యాను.నేను ఆపిల్ల ఇంటికి దింపుదామని వెళ్లితే తాళం కప్ప వేలాడుతోంది.ఇక చేసేదేమీ లేక ఒక్క ఇంటివారికి నాఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చి మాఇంటికి తీసుకుని వెళ్లాను.ఆపిల్ల అమ్మ నాన్న రాత్రి 10కి వచ్చి థాంక్స్ చెప్పి కూతురు ని తీసుకుని వెళ్లారు. అందుకే ముందు తల్లి బడి నుంచి పిల్లలు వచ్చే టైం కి ఇంట్లో ఉండితీరాలి.తనే తీసుకుని వెళ్లి దింపి మళ్ళీ ఇంటికి తేవాలి.🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి