అలాంటి రామ స్వామి చౌదరి గారు విశ్వనాథ వారికి చాలా దగ్గర స్నేహితుడు వారి పుస్తకాలు చదివి సమీక్ష చేయడం వీరి పుస్తకాలు వారు వారి పుస్తకాలు వీరు చదవడం అభిప్రాయాలను పంచుకోవడం పరిపాటి. అతను సనాతన ధర్మాన్ని పాటించడం లేదు కనుక నాకు విరోధి అన్న అభిప్రాయంతో ఎప్పుడు ప్రవర్తించలేదు ఆయన ఏ సిద్ధాంతాన్ని మనస్పూర్తిగా నమ్మి దానిని జీవితాంతం కొనసాగిస్తున్నాడో అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం కొన్ని మూఢ ఆచారాలను మూఢ నమ్మకాలను సమాజంలో తీసివేయడం అతను ప్రథమ కర్తవ్యం గా చేస్తున్నాడు దానిని మనం అభినందించాలి తప్ప. తప్పు పట్టకూడదు అంటూ అతనిని నడిపిస్తున్నది ఎవరు రాముడు కాదా రాముడు అంటేనే అంకిత భావంతో చేసేవాడు ఎదుటివారి సుఖాన్ని కాంక్షించేవాడు అని అర్థం అది వారి పేరులోనే ఉంది కదా అని చతురోక్తిగా చెబుతూ ఉండేవారు. ఒకరోజు సాహిత్య విషయాల గురించి మాట్లాడుతూ సన్నిహిత స్నేహితులతో పేరాల భరత్ శర్మా లాంటి శిష్యులు ప్రక్కనుండగా శ్రీ శ్రీ ప్రస్తావన వచ్చింది అతను రాసే కవితల్లో ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది అతను వ్యక్తిగతంగా నమ్మిన వామపక్ష సిద్ధాంతాల నేపథ్యంలో చాలా వరకు అతని కవితలు సాగుతూ ఉంటాయి. నిజానికి ఆయన రాసిన కవితలు కొన్ని చాలామందికి అర్థం కావు నిజానికి వాడికి కూడా అర్థం కాదు ఒక కవిత చెప్తాను వినండి వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ జగన్నాథ రథచక్రాలు రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అంటే సరిపోతుంది కానీ తాను మూడుసార్లు రాశాడు ప్రత్యేకించి ఒక్కొక్క దాన్ని అది వ్రాసేటప్పుడు దాని అర్థం తనకు, భగవంతునికి, నాకు మాత్రమే తెలుసు.
అతను ఏ కవిత వ్రాసిన దానిని అనుభవించి రాయడం తనకు అలవాటు పని కోసం బయలుదేరిన బాటసారి గురించి వ్రాసినది ఎంత అందమైన చక్కటి ముగింపు అలాగే ముసలమ్మ జీవితాన్ని గురించి అక్కడ ఏకాంతంగా కూర్చున్న ముసలమ్మను ఈగలు ముసురుతూ ఉంటే ఆ దృశ్యాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించాడు మనసున్న ఏ వ్యక్తికైనా ఆ గేయం చదివితే కన్నీరు రాకమానదు అతని కలానికి మంచి బలం ఉంది తాను తీసుకున్న ఇతివృత్తం ఏదైనా దానికి ఏదో ఒకటి మూల కారణం ఉంటుంది విజయనగరంలో చాగంటి సోమయాజులు (చాసో) తన బృందంతో ఆ ప్రాంతపు రచయితలను ప్రోత్సహిస్తూ ఎంతో కృషి చేశారు. ఆ సందర్భంగా శ్రీ శ్రీ వారి దగ్గరికి వెళ్లి కవిత్వాన్ని గురించి చర్చించి వచ్చాడు అప్పల స్వామి గారు ఈయనకు చాలా దగ్గర స్నేహితుడు అలా చక్కటి మార్గాన్ని ఎన్నుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి