మామిడి చెట్టు ;- తాళ్ల నవనీత్ రెడ్డి 9 వ తరగతి -సెల్ ; -9908855353


 అది 2201 సింహారెడ్డి పల్లి అనే గ్రామంలో రామ్ గోపాల్ వర్మ అనే బాలుడు ఉండేవాడు. అతనికి అప్పుడు 15 ఏళ్ల వయసు. అతను తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. రామ్ చాలా బాగా చదువుతాడు వాళ్ళ క్లాసులో అతన్నే ఫస్ట్ ర్యాంక్. అతనికి చదువులోనే కాకుండా లోకజ్ఞానం చాలా ఉంది   అతనికి చెట్లు అంటే చాలా ఇష్టం. వాళ్లపేరేట్లో మొత్తం చెట్లతో నిండి ఉంటుంది. వల్ల ఊరిలో వాళ్ల గ్రామం సర్పంచ్ ఇంటింటికి ఒక మొక్క ఇచ్చాడు అప్పుడు రామ్ వాళ్ళు మామిడి చెట్టు తీసుకున్నారు. అందరూ తీసుకొని బయటపెట్టి పడేసరే కానీ రాము తీసుకువెళ్లి వాళ్ళ పొలం దగ్గర నాటాడు. దానికి రోజు ఉదయం , సాయంత్రం నీళ్లు పోసేవాడు. అతను రోజు ఎదురు చూస్తూనే వాడు ఈ చెట్టు ఎప్పుడూ పెద్దగా అవుతుంది ఇప్పుడు మామిడి పళ్ళు ఇస్తుందని. కొన్ని రోజుల తర్వాత రామ్ మరియు వాళ్ళ కుటుంబం అంతా పట్నం వెళ్లారు రాము చదువు కోసం మరియు వాళ్ళ నాన్న ఉద్యోగం కోసం. రామ్ పట్నం వెళ్ళాక కూడా చిన్నచిన్న కుండీలో పూల మొక్కలు నాటేవాడు. అతను వల్ల ఊర్లో నాటిన మామిడి చెట్టు గురించి కొన్ని రోజుల్లో మర్చిపోతాడు.అతనికి 28 ఏళ్లు వచ్చాయి అతను పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు నెలకి  3.5లక్షలా  జీతం.అతను వల్ల పొలం దగ్గరికి వెళ్దాం అనుకోని అతని బండి మీద వెళ్ళాడు పోతూ ఉంటే అతని బండిలో పెట్రోల్ అయిపోతుంది ఎంత కొట్టినా స్టార్ట్ కాదు చాలా ఎండ కొడుతుంది.వాళ్ల బావి మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అతను రెండు కిలోమీటర్లు నడిచాడు ఇంకా కొంచెం ఓపిక  ఓపిక లేదు.ఎటు చూసినా ఇంట్లోనే ఉంది చుట్టుపక్కల చెట్లు ఏం లేవు కొంచెం ముందుకి వెళ్ళగానే అతనికి చాలా ఆకలి వేసింది అతను మెల్లిగా నడుచుకుంటూ ఎలాగోలా దగ్గరికి చేరాడు అప్పుడు అతను చిన్నప్పుడు నాటిన మామిడి చెట్టు చూశాడు చాలా పనులు ఉన్నాయి గా ఉంది అతను పరిగెత్తుకుంటూ వెళ్లి విశ్రాంతి తీసుకొని తిన్నాడు.అప్పుడు అతను అనుకున్నాడు నా జీతంలో కొంత భాగం తీసి రోడ్డుపైన మొక్కలు నాటే రోజు నీళ్లు పోసి ఇస్తానని.నీతి : తను పడ్డ కష్టం ఎదుటివారు పడొద్దు అని ఆలోచించడం అనేది చాలా గొప్ప గుణం


కామెంట్‌లు