తపసు నేల ముగిసింది!
మనసు నింగి ఎగిసింది!
1. కాశీనాధుని విశ్వనాథుడు!
సినిమా కాశీకి దర్శకనాథుడు!
సంగీతనాట్యాల కళానాధుడు!
సాహితీసంస్కార ఆరాధకుడు!
తెలుగు సినిమా విశ్వానికి,
ఎత్తిన పరిశోధకుడు!
2.తెలుగు సినీప్రస్థానం,
శంకరాభరణం
ఓ మైలురాయి!
సిరివెన్నెల, కీర్తి కిరీటంలో,
మెరిసే కలికితురాయి!
స్వాతిముత్యం ఇంకిపోని,
ఆనందామృతపాయి!
సాగర సంగమం ఎన్నడూ,
మరపురాని మనహాయి!
దర్శక నిలువెత్తు సంతకం,
విశ్వనాథుడే నోయి!
3.కె.వి.విశ్వనాధ్ సినిమా వస్తే!
ప్రేక్షకులకు పరమానందం తెస్తే!
నటుల జీవితం చరితార్థం చేస్తే!
అదో సజీవ కళావిష్కరణమే!
వెండితెర వన్నెతగ్గని,
సువర్ణభరణమే!
4. సినిమా కేవలం ఓ కులాసా?
అది సమాజానికి ఓ పాఠశాల!
సర్వజన ఆనంద నర్తనశాల!
లలిత కళల సమాహారహేల!
మన విశ్వనాధునికే తెలిసిన,
పరమాద్భుత లీల!
5. శంకరాభరణం అర్పించి!
శంకర చరణం శరణంసాధించి!
దర్శక దాదాసాహెబ్ గా నిలిచి!
జనహృదయపద్మశ్రీయై విరిసి!
అతడో నిత్యసుమనస్వి!
కళాతపస్వి! చిరయశస్వి!
_________
కాశీనాధుని విశ్వనాథుడు!; -డా. పి.వి.ఎల్ .సుబ్బారావు, 94410 58797
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి