మహాశివరాత్రి శుభాకాంక్షలతో,=====================1. ధరిత్రి కైలాసమై పులకించే,రాత్రి మహాశివరాత్రి!తెలుసుకుంటే చాలు మనిషి,జన్మనికో శివరాత్రి!శివ ఆరాధనం, నామం,అభిషేకం, అర్చనం!ఏది వీలుంటే అది, నీకు ,పరమ పుణ్య సాధనం !"శవం" కాకముందే "శివం",తెలిస్తే జన్మ సార్ధకం!2. హరి హర సమన్వయం,జీవితాన అన్వయం!శివ హృదయాన కేశవుడు,కేశవ హృదయాన శివుడు!శివకేశవుల అభేదం,తెలుసుకో, అదే అద్వైతం!దైవం పేరునా, మానవజాతికి,ఎందుకు వైరం!మతం కాదు మానవత్వం,అదే దైవతత్త్వం!3. ద్వాదశ జ్యోతిర్లింగాలు,అష్టాదశ పీఠాలు దర్శించు!అష్టాదశ పురాణాలు ,శ్రద్ధగా నిత్యం పఠించు!దగ్గరలో ఉన్న దేవాలయాన,దైవాన్ని పూజించు!నీ జీవితాన్ని పుష్పంగా,పవిత్రంగా సమర్పించు !జగత్ లయ కారకుడు,నీ "ఆత్మభవుడు", గ్రహించు!4. వాక్ అర్థాల్లా ఏకమై ఉన్నది,అర్ధనారీశ్వర తత్త్వం!జగతికి తల్లిదండ్రులైన,గౌరి శంకరులకు వందనం!మన అమ్మానాన్నలే ఈ ఇల,పార్వతీ పరమేశ్వరులు!జన్మ,కారకులు, పోషకులు,జ్ఞానబోధకులు, రక్షకులు,!బతికిఉంటే ప్రత్యక్ష దేవతలు,పైనుంటే వారే పితృదేవతలు!5. భక్తుల చరితలు ,జీవితానికి సూచికలు!సాంబుడికి చెంబుడు ,నీళ్లు పోయి !ఆదిబిక్షువుకి,ఒక్క బిల్వపత్రం వేయి!ఆయనలా గళానగరళంఉంచు,జగతికి వెన్నెల పంచు!నరుడు శివుడు అవ్వాలి,జీవితాన ధన్యుడవ్వాలి!_________
ఓ ఏలికా, అక్షరమాలిక!;- డా. పి. వి. ఎల్ .సుబ్బారావు,- 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి