" పిట్ట కొంచెం, గణితంలో ఘనం "; - మడ్డు తిరుపతి రావు;- 9491326473
 " పిట్ట కొంచెం, కూత ఘనం " అనే సామెతను అక్షరాల నిరూపిస్తుంది,శ్రీకాకుళం జిల్లా,కంచిలి మండలం, చోట్రై పురం గ్రామంలో గల ఎంపిపి స్కూల్ లో 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని బడ్డి సంజన అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మడ్డు తిరుపతి రావు తెలిపారు.బడ్డి సంజన ప్రతిభా పాటవాలు పరిశీలిస్తే భారత దేశంలోని 29 రాష్ట్రాలు వాటి రాజధానులు,ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల పేర్లు,విద్యారంగంలో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశి పెట్టిన పథకాలు పేర్లు, వాటి వివరణ,A నుండి Z వరకు ప్రతి అక్షరంతో పదాలు, గణితం లో ఒకటి నుండి పది వరకు స్పెల్లింగ్స్ చెబుతుంటే  నంబర్స్ రావడం మొదలగు అంశాలు గురించి ధారాళంగా చెబుతుంది.ఉదయం పాఠశాలలో జరిగే ప్రార్థన సమయం నుండి సంజన చాల ఆసక్తిగా ఉంటూ,అన్ని  విషయాలను పరిశీలిస్తూ ఒకరోజు ప్రతిజ్ఞను ఇంగ్లీష్ లో చెప్పడం చూసి,దానిలోని సృజనాత్మకతను గుర్తించి,ప్రత్యేకమైన శిక్షణ తో నేడు అన్ని అంశాలను ధారాళంగా చెబుతుందని గణిత అవధాని మడ్డు తిరుపతి రావు మాష్టర్ అన్నారు .సంజన తల్లిదండ్రులు బడ్డి ఖగేష్,రాములమ్మ నిరక్షరాస్యులు,తండ్రి గొర్రెలు కాపరి,తల్లి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం  సాగిస్తున్నారు.విద్యార్థిని సంజన లోని ప్రతిభను వెలికి తీసిన మడ్డు తిరుపతి రావు మాష్టర్ ను సర్పంచ్ శ్రీ డొక్కరి బ్రహ్మానందం,పాఠశాల PMC చైర్మన్ శ్రీ కర్రి సుందరరావు,వైస్ చైర్మన్ శ్రీమతి కర్రి యశోద ,మరియు గ్రామ పెద్దలు,యువత అభినందించారు.

కామెంట్‌లు