మానవ జీవితంలో మంచివారు చెడ్డవారు కలిసే జీవిస్తూ ఉంటారు. ఎంత మంచి వారైనా ఒకటి రెండు చెడు లక్షణాలు ఉండకుండా ఉండవు. అదే చెడ్డవాడిలోనూ ఒకటి రెండు మంచి గుణాలు ఉండవచ్చు. కనుక ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరు పూర్తి మంచి గాను చెడ్డగాను ఉండరు అన్నది స్పష్టం. రకరకాల తత్వాలతో ఏర్పడినది ఈ శరీరం ఏ అవయవ లక్షణాలు కలిగిన అవయవం ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది సమష్టిగా ఆ పని చేయకపోతే ఈ మానవ శరీరం నడవడం కష్టం అదీ కాక ఒకడు చేసినది మరొకరికి నచ్చకపోవచ్చు అంత మాత్రం చేత అది చెడ్డతనమవుతుందా? అతను ఏ ఆలోచన లేకుండా అలా చేయడానికి ప్రయత్నిస్తాడా అతని ఆలోచన అతనికి ఉంటుంది దానిని మంచి అని తాను భావించిన తర్వాతనే చేస్తాడు. పాదరసాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన విషయమే లేదు అన్ని మూలకాలలోకి అతి విలువైన పదార్థం దానిని మించినది మరొకటి లేదు అలాగే ఇనుము ఉంది ఇది ఎంతో గట్టిగా పగలగొట్టడానికి వీలు లేకుండా ఉంటుంది గొప్ప గొప్ప భవన నిర్మాణాలకు కూడా అది పనికి వస్తుంది దానికి నీరు తగిలితే తుప్పు పట్టిపోతుంది ఎందుకు పనికిరాదు అలాంటి పదార్థం పాదరసంతో కలిసినప్పుడు అది బంగారంగా మారిపోవడం మనందరికీ తెలిసిన విషయమే వేమన అద్భుతమైన రెండు ఉపమానాలను తెలియజేస్తూ మంచి చెడు రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి విడివిడిగా ఉన్నప్పుడు వాటి పద్ధతి వేరు కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ వేరు అంటూ వాటిని వివరిస్తున్నాడు వేమన.
నిప్పు ఏ వస్తువునయిన భస్మం చేస్తుంది. ఎందుకూ పనికి రాకుండా చేస్తుంది కర్పూరం ఉంది అది చక్కటి సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది నేను నిప్పుకు ఆ కర్పూరం తోడైతే చక్కటి కాంతిని సువాసనలతో మనకు అందిస్తుంది ప్రకృతి సిద్ధంగా ఉన్న పుష్పం చూసిన ప్రతి పడతి తన సిగలో ధరిస్తుంది ఆ పుష్పానికి వాసన తోడైతే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేం. అలాగే మనిషిలో కూడా మంచి చెడు దాగి ఉన్నట్లే ముక్తి మార్గం కూడా దాగి ఉంటుంది ఆ ముక్తిని కనుగొని దానికోసం ప్రయత్నం చేస్తూ మానవుడు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా అతను స్వర్గలోకానికి వెళ్తాడు ఈ తత్వాలు విడమర్చి చెప్పడంలో వేమన తర్వాతే ఎవరైనా అలాంటి పంచాన్ని ఒక్కసారి చదవండి.
"పరుస మినుము సోకి బంగారమైనట్లు
కప్పురంబు జ్యోతగలసినట్లు పుష్ప మందు తావి పసగునట్లకు ముక్తి..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి