జీవితంలో అనేక మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను చూస్తూ ఉంటాం. బాగా డబ్బు కలిగిన వాడు ఎప్పటికప్పుడు ఆ డబ్బును ఇంకా ఇంకా పెంచాలని ఆలోచిస్తారు తప్ప దానిలో ఖర్చు అయిపోతే మనసు చివుక్కుమంటుంది ఉన్నవాడిని, లేనివాడిని పోల్చి చెప్పవలసి వస్తే కూడబెట్టడానికి అలవాటు పడిన వాడు తన కూడు కూడా సరిగా తినక ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కొంచెం కొంచెం ధన ఆర్జన చేసుకుంటూ ఉన్నదానిలో సుఖంగా కాలం గడుపుతూ ఉంటాడు లేనివాడు. దీనిని గమనించిన ధనవంతుడు తన భార్యతో ఆ బీదవాని భార్యకు 99 రూపాయలు ఇవ్వు నీవు ఇచ్చినట్టుగా చెప్పవద్దు అన్న తర్వాత ఆమె భర్త మాటను తూచా తప్పకుండా నేను వస్తుంటే మీ డబ్బు ఏదో పోయినట్టుగా ఉంది నాకు దొరికింది అని ఆమెకు ఇస్తుంది. ఆ బీదవానికి అప్పుడు డబ్బు విలువ ఏమిటో తెలుస్తోంది 99 రూపాయలు ఉన్నాయి కదా ఇంకా ఒక్క రూపాయి దానికి కలిపితే 100 రూపాయలు అవుతుంది దానిని జాగ్రత్తగా చేసుకుందాం అని భార్యతో సంప్రదించి తాను తింటున్న భోజనాన్ని కూడా పొదుపుగా ఎక్కువ పదార్థాలు లేకుండా తినడం మొదలుపెట్టి దానిని అలా అలా పెంచుకుంటూ పోతాడు ఇది ధనవంతుడు చెప్పిన చిట్కా ఆ ధనవంతుడు తాను తినడు ఎదుటివారిని తిననివ్వడు. ఈ ప్రపంచంలో ఉన్న రెండు తరగతుల వ్యక్తులు ఒకరు ధనవంతుడై ఉండి కూడా నలుగురికి పెట్టగలిగిన స్తోమత కలిగిన వాడు పెట్టడు ఈ పేదవాడు తాను కడుపులోది తీసి పెట్టాలనుకున్నా తన దగ్గర ఆ స్తోమత లేదు కలిమి లేమి రెండు లేని పరిస్థితులు ఇంకా ఎక్కడైనా ఉంటాయా అనేది వేమన ప్రశ్న.
ఈ రెండు రకాల మనుషుల తత్వాలను వివరంగా చెబుతున్నాడు వేమన మహర్షి జీవితం మనకు తెలియకుండా మన మనసును అది స్వాధీనం చేసుకొని ఏది చేయాలో ఏది చేయకూడదో కూడా నిర్ణయించి ఒక పథకం ప్రకారం జీవితాన్ని గడిపినట్లయితే ఆ వ్యక్తి మనసు ఆనందంతో నిండి ఉంటుంది ఎదుటి వారి ఆకలి కూడా తన ఆకలి లాంటిదే అని గమనించి అలా ప్రవర్తించినట్లయితే సంఘంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి తనకు మానసిక తృప్తి కలుగుతుంది సామాన్యంగా మనం చూస్తున్నాం నిక్కమైన సత్యం ఏమిటంటే లేనివాడు ఇతరుల కడుపునింపడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అతనికి ఆ స్తోమత లేదు ఉన్నవాడు స్తోమత ఉండి కూడా మంచి పనికి పూనుకోడు అని చెప్పడమే వేమన అభిప్రాయం ఆ పద్యాన్ని చదవండి.
"కలిమి నాడు నరుడు కానడు మదమున లేమి నాడు మొదలె లేదు పెట్ట
కలిమిలేమి లేని కాలంబు గలుగునా..."
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి