పరస్పర సహకారం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు  బిడ్డ పుట్టినప్పుడు అన్ని అవయవాలు  సక్రమంగా ఉండి  ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే  ఆ తల్లిదండ్రులకు  ఉండే ఆనందమే వేరు.  దురదృష్టవశాత్తు కొంతమంది  పుట్టుకతోనే అవయవ లోపాలతో పుట్టేవాడు కొంతమంది ఉంటారు  పిల్లల అశ్రద్ధ వల్ల ప్రమాదాలకు లోనై అవయవాలను పోగొట్టుకున్న వారు మరి కొంతమంది ఉంటారు. ఈ సమాజంలో  వీరిని చూసి కొంతమంది జాలి పడుతూ ఉంటారు కూడా  అయితే వీరు తమ ప్రజ్ఞా పాటవాలను చూపి  పెద్ద చదువులు చదివిన వారు పీహెచ్ డిలు చేసిన వారు  పెద్ద కంపెనీలలో పెద్ద ఉద్యోగస్తులుగా ఉన్నవారు లేకపోలేదు  మరి వికలాంగులు పనికిరారు అనుకున్నప్పుడు  ఎంతమంది ఇలా గొప్ప విషయాలను సాధించగలుగుతున్నారు. మన శరీరంలో ఉన్న ఐదు అవయవాలలో  ఒక అవయవం  పనిచేయకపోయినట్లయితే  దాని ప్రభావం మిగిలిన నాలుగు అవయవాల మీద పడుతుంది  దానివల్ల ఇది చేయవలసిన పని ఆ నాలుగు కలిసి చేస్తాయి అని మానసిక విశ్లేషకులు చెప్తారు. వీరిలో కళ్ళు లేని కబోదులు ఉన్నారు  కాలు చేయి పోయిన కుంటి వారు ఉన్నారు. మూగబోయిన చెవిటి వారు అనేక  పద్ధతులు అనేకమంది ఉన్నారు. అసలు ఏ వ్యక్తికైనా తాను ఏదైతే అనుభవించాడో దానిని ఇతరులు అనుభవిస్తే  దాని గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తనకు తెలుస్తుంది. దానికి కారణం అంతకుముందు తాను అనుభవించి ఉన్నాడు కనుక  అలాగే వీరిలో కూడా అద్భుతమైన సహచర్యం ఏర్పడుతుంది తోటి వారిని  ఆదుకోవాలన్న జ్ఞానం వారికుంటుంది. బీదవారిని చూడండి  మరొక బీదవారికి సహాయం చేసే స్థితికి ఎందుకు వచ్చాడు  తాను అనుభవించాడు కనుక  ఇది కూడా అంతే  ఒకరికొకరు సహకరించుకుంటూ  ఒకరినొకరు ఒదార్చుకుంటూ  ఒకరి కష్టాలు మరొకరికి చెప్పుకుంటూ  వాటిని ఎలా  పరిష్కరించుకోవాలో కూడా వాడే చెప్పుకుంటూ ఉంటారు.  ఇలాంటి తత్వాలు వారికి తప్పకుండా ఉంటాయి. రక్త సంబంధీకులు కూడా ఆప్యాయంగా కలిసి మెలిసి ఒకే కుటుంబంలో  ఉన్న వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారిని చూసి జాలి పడటం కాదు  చేతనైతే  ఆ లోపాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి అని వేమన హితవు పలుకుతున్నాడు  ఈ పద్యాన్ని ఒకసారి చదవండి.


"కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు  
యుభయులరయ గూడియుండినట్లు  
పేద పేక గూడి పెనగొని యుండును..."



కామెంట్‌లు