పల్లెటూర్లలో కానీ పట్టణాలలో కానీ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని సమాజానికి విద్యాబోధన తప్పకుండా ఉండాలని ప్రతివారు ఆరోగ్యరీత్యా ఎలాంటి రుగ్మతలకు పాలు కాకూడదని ఆలోచించి ఆ గ్రామంలో కానీ, నగరంలో కానీ ఉన్న పెద్దలు కొందరు సమాజ హితం కోసం తమ దగ్గర ధనం లేకపోయినా ఆ గ్రామంలో కానీ లేదా దాతల దాతృత్వంలో కానీ విద్యాలయాన్ని స్థాపించి కొంతమంది ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులను తయారు చేసి వారి భవిష్యత్తు ఆనందమయంగా ఉండడం కోసం ఎంతో కృషి చేస్తారు. అలాగే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యం తెలిసిన ఒకరిని ఆ గ్రామానికి వచ్చే ఏర్పాటు చేసుకొని వారికి కావలసిన సకల సౌకర్యాలు కలిగిస్తూ ఉంటారు ఇది ఉదాత్ములు చేసే పని.
ఆ విద్యాలయం కానీ వైద్యాలయం కానీ వారి
జీవించినంత కాలం సక్రమంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద మనసుతో ఆడుకుంటూ ఉంటారు. నిజానికి ఈ రెంటిని ఎవరు ప్రారంభించి అభివృద్ధి చేస్తూ నిత్యం దానికోసం కృషి చేస్తూ ఉన్నారో వారి గురించి అక్కడ విద్యార్థులకు ఏమాత్రం అవగాహన ఉండదు. వైద్యానికి సంబంధించినది కూడా అంతే ఎవరికి వారు భగవంతుడు లాంటి వ్యక్తి వల్ల నాకు అక్షర జ్ఞానం కలిగింది అని విద్య నేర్చుకున్న వారు ఎవరో పుణ్యాత్ముడు దయ చూపడం వల్ల ఈ చిన్న ఆసుపత్రి నా ప్రాణాన్ని కాపాడింది వారు ఎవరో నాకు తెలియకపోయినా వారి జీవితం సుఖవంతంగా ఉండాలని కోరుకుంటాను ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. కాలం ఎవరిని ఈ భూమి మీద ఎక్కువకాలం ఉంచదు ఇతను మంచివాడా అతను చెడ్డవాడా అన్న ఆలోచన లేకుండా అందరినీ ఒకే రకంగా తనలో చేర్చుకుంటూ ఉంటుంది ప్రకృతి వీరి పరిస్థితి కూడా అంతే వీరు పరవలోకంలోకి వెళ్ళిన తరువాత విద్యాలయాన్ని గురించి గానీ వైద్యాలయాన్ని గురించి గానీ పట్టించుకునేవారు ఎవరు ఉండరు. దానివల్ల వైద్యులు నిరాశ చెంది తన జీవనోపాధి కోసం వేరే గ్రామానికి వెళ్లిపోవడం జరుగుతుంది. విద్యాలయాలలో కూడా ఉపాధ్యాయులకు కానీ మిగిలిన ఉద్యోగులకు కానీ సదుపాయాలు తక్కువైనప్పుడు వేరే వనరులు చూసుకుని వెళ్ళిపోతారు ఈ వ్యవస్థ పూర్తిగా నశించిపోతుంది అతి సామాన్యంగా జరిగే విషయాన్నీ వేమన తన పద్యం ద్వారా మనముందు ఉంచారు ఆ పద్యం చదవండి.
"ఎన్నాళ్ళను దానుండును ఎన్నాళ్ళనుదాను నేర్చి ఎన్నిట వెలయున్
కొన్నాళ్ళకు దా జన్మను మన్నయ్యను విద్యల లెల్ల (మహిలో) వేమ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి