భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రజలలోకి తీసుకువెళ్లి వ్యాస భారత విశేషాలు చెప్పినవాడు శ్రీ శుక మహనుభావుడు వారి జన్మ రహస్యం చాలా మందికి తెలియదు. తల్లిదండ్రులు వారికి జన్మను ఇవ్వలేదు. చిలుక గర్భం దాల్చి వారికి జన్మనిచ్చింది ఒక పర్యాయం రాజు గారి దర్శనం కోసం శుక మహర్షితోపాటు వ్యాసుల వారు వెళ్ళినప్పుడు వీరిద్దరి గొప్పతనాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియక మహారాణి సాయం కోరగా వారు మాట్లాడుతున్న సమయంలో ఆమె నగ్నంగా వచ్చి వారి మధ్య కూర్చున్నది. వ్యాసుల వారు ఆమె స్పర్శ అంటుతుందేమో అన్న దృష్టితో ప్రక్కకు జరిగి కూర్చున్నారు కానీ ఆమె స్పర్శ తగిలినా దానిని పట్టించుకోకుండా తన స్థానాన్ని మారకుండా మహారాజుతో తన వాదాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. కనక ప్రాపంచిక సుఖాలకు అతీతంగా జీవించిన వ్యక్తి మహానుభావుడు శ్రీ శుక మహర్షి. ముని శ్రేష్టులందరికి ఆరాధ్య దైవం ఆదర్శప్రాయుడు. శుక మహర్షి ఆలోచనలోనూ, పురాణ విషయాలు చెప్పడంలోని తాను ఆచరించడంలోనూ కూడా మనోవాక్కాయ కర్మల ద్వారా హిందూ ధర్మాన్ని వ్యక్తిగతంగా ఆచరించి చూపించిన వాడు కనుక ప్రతి వారికి ఆయన ప్రాతః స్మరణీయుడే అలాంటి మహా వ్యక్తికి ఏదైనా ఒక మతాన్ని కులాన్ని లేదా వర్గాన్ని వర్ణాన్ని ఆపాదిస్తే అంతకుమించిన పిచ్చితనం మరి ఏమైనా ఉంటుందా మనిషి పుట్టుక వల్ల తన గుణాలు అలవాట్లు వస్తాయి అని భ్రమించడం సమాజానికి అలవాటైపోయింది. అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు అని అనేక ఆటవెలది పద్యాల ద్వారా సమాజానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి వేమన. ఒకే విషయాన్ని చెప్పడానికి అనేక ఉదాహరణలతో అనేక ఆట వెలదులను అందించిన వాడు.
ఏ విషయాన్ని అయినా మనం పోల్చాలంటే ఉపమానము ఉపమేయము రెండూ ఉండాలి ఏ వస్తువును గురించి నీవు మాట్లాడదలచుకున్నావో ఆ వస్తువు లక్షణాలను చెప్పి దానికి సరిపడిన మరో వస్తువును చూసి రెండింటినీ పోల్చడం అప్పుడు శ్రోతకు కానీ ప్రేక్షకునికి గాని చదువరికి కానీ దానిలో ఉన్న లోతైన అర్థం తెలుస్తుంది అన్న విషయంతో వేమన మహాశయుడు ప్రత్తిని ఉదాహరణగా చెబుతూ చిత్రపటాలతో దానిని పోల్చి మనకు చెబుతున్నాడు సమాజంలో మూఢ నమ్మకాలను నిర్మూలించడం కోసం కంకణం కట్టుకొని ఒక ఉద్యమంగా దానిని ఆటవెలదిని ఆయుధంగా మలచి సమాజానికి అందించిన యోగి కనుకనే యోగి వేమన అని పేరు పొందాడు ఆ ఆటవెలదిని ఒకసారి చదవండి.
"చిలుక గర్భమందు శ్రీ శుకుడుయయించి ముని వరేణ్యులందు ముఖ్యుదయ్యె
ప్రత్తి కాయ చిత్రపటములు పుట్టవా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి