ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 భారతదేశానికి రైతే వెన్నెముక అన్న మహాత్మా గాంధీ  వాక్యాన్ని వల్లె వేసిన వారు అనేక మంది ఉన్నారు  కానీ కార్య రూపంలో రైతుకు  సహాయంగా నిలబడిన వాళ్లు కొద్దిమంది మాత్రమే. ప్రభుత్వాలు కూడా ఎన్నో పథకాలు  ప్రవేశపెట్టినా రైతుకు చేసిన మంచి ఏమి లేదనే చెప్పాలి  మూర్తి రాజు గారు  వ్యవసాయ శాఖా మంత్రిగా ఉన్న రోజులలో కమ్యూనిస్టు  వామపక్ష  వాదులు  బీదలకు  భూమిని పంచి పెట్టాలి,  ఉన్న వారి దగ్గర నుంచి తీసుకుని లేని వారికి పంచాలి అన్న నినాదంతో  ముందుకు వచ్చినప్పుడు అసెంబ్లీలో మూర్తి రాజు గారు చెప్పిన విషయం  నినాదాలలో ఉన్న నిజం కార్యరూపంలో కనిపించదు  మీరు చెప్పినట్టు చేసిన  కొద్ది రోజులలోనే ఆ రైతులు అమ్ముకోవడం  కొంతమంది రైతులు కొనుక్కోవడం ఉంటుంది  ఆ వ్యవస్థను సరి చేయడం  మన వల్ల కాదు అని చెప్పారు.వ్యక్తిగతంగా తనకున్న ఆస్తి మొత్తాన్ని  బీదలకు పంచిపెట్టిన నా అనుభవంతో చెప్తున్నాను  నా ఆస్తినే కాక నా భార్య ఆస్తిని కూడా పూర్తిగా వందల ఎకరాలను  పంచిన తర్వాత  ఫలితం ఎలా ఉంది అని  విచారించినప్పుడు నాకు ఎదురైన సమస్య అదే  ఎన్నో సమస్యలతో బీద రైతులు  ఆ పొలాన్ని అమ్ముకొని  తన బాధలను తీర్చుకున్నారు.  కష్టపడి పని చేసిన రైతు  డబ్బులు కూడ పెట్టి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు  కనుక అనుభవంతో నేను చెబుతున్నాను అన్నారు మూర్తి రాజు గారు.  తరువాత దేశవ్యాప్తంగా  లాల్ బహుదూర్ శాస్త్రి  అనుకోని పరిస్థితుల్లో ప్రధానిగా వచ్చిన  సమయంలో వారి నినాదం  జై జవాన్ జై కిసాన్  ఈ దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి  ఎలా కాచి రక్షిస్తున్నారో  అలాగే ఆరుగాలం  ప్రతిక్షణం కష్టించి చెమటోడ్చి దేశానికి  భోజనం పెడుతున్న రైతులను విస్మరిస్తే  దేశం బాగుపడదు  అటు జవానులను ఇటు రైతులను  ఉద్ధరించని  ప్రభుత్వం  అనవసరం అని ప్రచారం కూడా చేశారు. కావలసినది నినాదాలు కాదు  మహాత్మా గాంధీ చెప్పినట్లు వెన్నెముక గా  చెప్పుకున్న రైతు జీవితాన్ని  సరి చేయకపోతే  ఆ వెన్నెముక విరిగిపోతుంది జీవితం నాశనం అయిపోతుంది  అలాగే దేశ ప్రగతి కూడా కుంటు బడిపోతుంది  ఏ రోజున పంట తగ్గిందో ఆ రోజున జనానికి  ఆహారం లేకుండా పోతుంది  కనుక రైతును ఆదుకోవలసిన పరిస్థితి  బాధ్యత ప్రభుత్వానికి  ఉంది అని ఎలుగెత్తి చాటి  రాజు  గా రైతు  నిలవకపోతే  దేశానికి పుట్టగతులు లేవు అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  గారు మాటలు చెప్పడంతోనే కాదు  చేతలలో కూడా చూయించినవాడు  జిల్లాల వారీగా  రైతు స్థితిగతులను అధ్యయనం చేసి  ఏ జిల్లాలో ఏ రైతు ఆ జిల్లాకు  వ్యవసాయాన్ని గురించి  చెప్పే అర్హత  ఉన్న సత్తా కలిగిన వారిని  ఆ జిల్లా మొత్తానికి ఉత్తమ రైతుగా ఎన్నిక చేశారు.
కామెంట్‌లు