మానవులలో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి ప్రశాంత వాతావరణంలో జీవితాన్ని కొనసాగిస్తూ తన పనులు తప్ప మరొక పని జోలికి వెళ్ళని సాత్విక మనసుతో ఉన్నవారు ఏ చిక్కులలో తాను తన కుటుంబం తప్ప మరొకరి విషయాలు పట్టించుకోరు వారు ఎంతో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు కొన్ని రకాల మనుషులు అందరి విషయాలు తమకే కావాలి వెంకయ్య పుల్లయ్య సుబ్బమ్మ వెంకటమ్మ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారు ఈ విషయాలన్నీ ఆరాతీస్తూ దానికి చిలవలు పలువలు కల్పించి అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఇంకొక రకంగా డాంబికులు లేనిది ఉన్నట్లుగా చెప్పుకొని తాను తప్ప ఈ సమాజంలో గొప్ప వారు ఎవరు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. సామాన్యంగా వ్యాస మహర్షి చెప్పిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రపంచంలో మంచి వారెవరో చెడ్డ వారు ఎవరో తెలుసుకోవడం కోసం పాండవులలో ధర్మరాజు కౌరవుల లో దుర్యోధనుడు బయలుదేరి అన్ని ప్రాంతాల లో ఉన్న చిన్నా పెద్దా మనస్తత్వాలతో ప్రవర్తిస్తున్న వ్యక్తుల మనస్తత్వాలను తెలుసుకొని తిరిగి వచ్చిన తరువాత ఈ ప్రపంచంలో నాకు చెడ్డవారు ఎవరూ కనిపించలేదు అందరూ మంచివారు అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాదు ధర్మరాజు నేను తిరిగి సేకరించిన సమాచారం ప్రకారం ఏ ఒక్క మనసు ఉన్న మనిషి కనిపించలేదు ప్రతి ఒక్కరు కల్మషహృదయాలతో నీచ తత్వంతో బ్రతుకుతున్న చెడ్డవారే అన్న అభిప్రాయాన్ని తెలియజేశాడు దుర్యోధనుడు అంటే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది నీ మనసు కల్మషం లేకుండా ఉంటే అందరూ కల్మషరహితంగానే కనిపిస్తారు నీవు దురాలోచనతో ఉన్నప్పుడు ఇతరులు కూడా దుర్మార్గులు గానే నీ కంటికి కనిపిస్తారు ఈ విషయాన్ని వేమన అద్భుతమైన తన ఆటవెలది లో తెలియపరిచారు రాజ కుటుంబంలో జన్మించినా అన్ని రకాల ప్రజల మనస్తత్వాలను కాచివడబోసిన వాడు కనుక తన అనుభవ సారం ఈ పద్యంలో మనకు కనిపిస్తుంది ఎవరు పరిశుద్ధ ఆత్మతో ఉంటారో వారికి ప్రతి ఒక్కరూ శుద్ధమైన వారిలా గానే కనిపిస్తారు కనుక నీ మనసును శుద్ధి చేసుకుని ఎలాంటి దుష్ట ఆలోచనలకు తావు ఇవ్వకుండా జీవించినట్లయితే నీవు కూడా ఉత్తమ స్థాయికి వస్తావు అని చెప్పడమే వేమన ధ్యేయం. ఆ పద్యాన్ని ఒకసారి చదవండి
"తన మది కపటము గలిగిన తన వలెనే కపటముండు తగ జీవులకు తన మది కపటము విడచిన తనకెవ్వరూ కపటి లేరు ధరలో వేమ..."
"తన మది కపటము గలిగిన తన వలెనే కపటముండు తగ జీవులకు తన మది కపటము విడచిన తనకెవ్వరూ కపటి లేరు ధరలో వేమ..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి