తత్త్వం మూలం;- ఏ బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 జీవితంలో దేనినైనా రుచి మరగడం  ప్రతి ఒక్కరికి అనుభవమే  తనకు బాగా ఇష్టమైన గుత్తి వంకాయ కూర  తిన్న తర్వాత మరి ఏ కూర మీద మనసు పడదు  ఎప్పుడూ అదే తినాలని అనిపిస్తుంది  మన పెద్దవాళ్ళు ఒక నానుడి చెబుతూ ఉంటారు  ముండను మరిగినవాడు మీగడ మరిగినవాడు మానడు అని  దీనిలో అర్ధం తెలిస్తే తప్ప జీవిత సత్యం అర్థం కాదు  పాలలో ఉన్న  పూర్తి జీవం మీగడగా పైన తేరుకుంటుంది.  అది తీసుకున్నట్లయితే ఆ పాలలో ఉన్న శక్తి మొత్తం తాను అనిభవించినట్లు లెక్క  ఏదైనా ఒక కావ్యాన్ని చదవాలంటే దానిలో ఉన్న మూల పదార్థం ఏమిటో తెలిస్తే ఆ కావ్యం మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు కదా  అలాగే ముండను అంటే బోడి గుండును మరిగినవాడు అంటే అర్థం చేసుకున్న వాడు అలవాటు పడిన వాడు మరి దేనికి ఆశపడడు. ఏ కాలంలోనైనా తల మీద నీళ్లు పోసుకుంటే  ఎలాంటి రుగ్మతలకు దారి తియ్యదు ఆరోగ్యాన్ని కాపాడడానికి మొదటి సూత్రం చన్నీళ్లతో తల మీద స్నానం చేయడం  దానికి అలవాటు పడిన వాడు  జుట్టును పెంచి  అందంగా తయారు కావడానికి ఇష్టపడడు  శరీర ఆరోగ్యం ముఖ్యం కనుక  దానికి ప్రథమ ప్రాముఖ్యతనిస్తాడు. దేవతలు సుధను అంటే అమృతాన్ని  సేవిస్తారు  దానిని మించిన రుచి  శరీరానికి అది ఇచ్చే ఆరోగ్యం  మరి ఏదీ ఇవ్వదు.  అలాంటివాడు దానిని మర్చిపోయి పాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడా  అలా చేస్తే వాడిని వెర్రి వెంగళప్పలా జమ కడుతుంది సమాజం. కనుక ఏది రుచికరమైనదో  రుచి అంటే వెలుగు అని అర్థం కూడా ఉంది  ఆ వెలుగును చూసిన తర్వాత చీకటిలోకి వెళ్ళడానికి  ఎవరికైనా మనస్కరిస్తుందా  లేదు కదా. అలాగే తత్వాన్ని  తెలుసుకోవటం కోసం జీవితమంతా తపస్సు చేసి  ఏదైతే శాశ్వతంగా ఉంటుందో  దానిని తెలుసుకోవడం కోసం పెద్దల సహకారంతో ఏదైతే ఉన్నదో అది శాశ్వతము అన్న  సత్వాన్ని గురించి తెలుసుకున్న తరువాత  దాని సిద్ధాంతాన్ని గురించి వ్యాఖ్యానించడానికి  దానిని విశ్లేషించి ఇతరులకు చెప్పడానికి  అతని మనసు అంగీకరిస్తుందా?  ఏ జీవి తన గమ్యాన్ని చేరాలని  జీవితమంతా దాని కోసమే ప్రయత్నం చేసి అక్కడకు చేరిన తరువాత  తిరిగి వేరొక మారు రావాలని అనుకుంటే  ఎవడైనా స్వర్గంలోకి వెళ్లిన తర్వాత మళ్లీ నరక కూపానికి వచ్చి ఎలా ఉంటుందో చూద్దామని  అనుకుంటే అతనిని ఏమనాలో  వేమన అలా అంటున్నాడు  ఎంతో అనుభవంతో చెప్పిన ఈ పద్యం  తప్పకుండా మనలను  అలరిస్తోంది అనడంలో సందేహం లేదు.

"కడుపునిండ సుధను గ్రమముతో ద్రావిన  
పాల మీద నేలపారు మనసు  తత్వమెరుగ వెనుక తత్వంబులేటికో..."


కామెంట్‌లు